ఏపీ అసెంబ్లీలో టెన్షన్‌, టెన్షన్‌.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు

0
557

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుంచి సభలో టీడీపీ సభ్యుల ఆందోళన.. వారిని సస్పెండ్‌ చేయడం నిత్యకృత్యంగా సాగుతుండగా.. ఇవాళ ఘర్షణ వరకు దారి తీసింది.. సభలో టీడీపీ ఎమ్మెల్యే డోలా, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కొట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. జీవో నంబర్‌ 1ను రద్దు చేయాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ.. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది.. జీవో నంబర్‌ 1ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు.. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు.. సభలో బైఠాయించిన ఆందోళన వ్యక్తం చేశారు.. స్పీకర్‌ దగ్గర ప్లకార్డులను ప్రదర్శించారు.. అయితే, ఇక్కడ ఘర్షణకు దారి తీసింది..

స్పీకర్ ముఖంపై ప్లకార్డును పెట్టారు టీడీపీ ఎమ్మెల్యే డోలా.. అయితే, ఆ ప్లకార్డును పక్కకు తోసేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. దీనిపై తీవ్రంగా స్పందించిన డోలా.. స్పీకర్‌తో దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది.. ఇక, స్పీకర్ తో టీడీపీ ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించటంతో రక్షణగా పోడియం దగ్గరకు వెళ్లారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు.. సుధాకర్‌బాబు సహా మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పోడయం దగ్గరకు వెళ్లగా.. అక్కడే.. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. ఎమ్మెల్యేలు డోలా, సుధాకర్‌ బాబు కొట్టుకున్నట్టు తెలుస్తోంది. దీంతో.. సభలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.. టీడీపీ సభ్యులపైకి దూసుకెళ్లారు వైసీపీ ఎమ్మెల్యేలు సంజీవయ్య, ఇతరులు.. వెంటనే తమ సభ్యులు ముందుకు వెళ్లకుండా మంత్రి అంబటి రాంబాబు, శ్రీకాంత్ రెడ్డి అడ్డుకున్నారు.. ఇక, వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here