breaking news: పిల్లులకు పోస్ట్ మార్టం.. భోలక్ పూర్ లో వింత ఘటన

0
28

కొందరు జంతువుల పట్ల చూపించే ఆదరణ వాటికి ఏదైనా అయితే పడే ఆవేదన వాటిని ఎవరేమన్నా అంటే వచ్చే ఆవేశం చూస్తే జంతు ప్రేమికులకు ఆ వ్యక్తికి జంతువుల పైన ఉన్న ప్రేమల కనిపిస్తుంది.. మరికొందరికి పిచ్చిలా అనిపిస్తుంది.. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి కారణం పెంపుడు జంతువులని ప్రాణంగ చూసుకునే వాళ్ళు కొందరైతే.. పక్కింటి పెంపుడు జంతువులతో వేగలేక విసుగుచెందే వాళ్ళు మరికొందరు.. ఈ జంతు ప్రేమికులకు ఎప్పుడు పొరిగింటి వాళ్లతో పోరు తప్పదు.. ఎందుకంటే అందరికి అన్నీ నచ్చాలని లేదు.. అలానే మనకి నచ్చిందే అందరూ చెయ్యాలనుకుంటే కుదరదు.. జంతువులని ప్రేమిచడం పోషించడంతో పాటు పొరుగువారికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి.. పోరుగువారు కూడా ఆలోచన లేకుండా మాట్లాడకూడదు.. అలా మాట్లాడితే ఇలాంటి ముప్పులే వస్తాయి.. ఇంతకీ ఎం జరిగిందనుకుంటున్నారా.. తన పిల్లులని ఎవరో విషం పెట్టి చంపారని వాటికి పోస్టుమార్టం చేసి నేరస్తుల్ని పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఓ వ్యక్తి..

ఈ వింత ఘటన హైదరాబాద్ ముషీరాబాద్ భోలక్ పూర్ లో చోటు చేసుకుంది.. భోలక్ పూర్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి 10 పిల్లులని పెంచుకుంటున్నారు.. కాగా ఆ పిల్లులు ఇరుగు పొరుగు ఇళ్లలో కి ప్రవేశించి ఇబ్బంది పెడుతుండేవి.. ఈ విషయమై ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న తోటి నివాసకులు మీ పిల్లుల వల్ల ఇబ్బంది అవుతుందని ఆ వ్యక్తి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన అతను వినలేదు..

దీనితో విసిగిపోయిన తోటివారు మాకు మీ పిల్లులవల్ల ఇబ్బది అవుతుంది మీ పిల్లులని జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే మీ ఇష్టం అని హెచ్చరించారు.. కాగా అతను పెంచుకుంటున్న 10 పిల్లులలో 6 పిల్లులు అకస్మాత్తుగా చనిపోయాయి.. దీనితో ఆ వ్యక్తి తనపిల్లులని ఎవరో హత్య చేశారని.. తనకి తన తోటి వారిపైనే అనుమానం గా ఉంది అని.. గతంలో పిల్లులు జాగ్రత్త అని హెచ్చరికలు చేశారని..కావున చనిపోయిన పిల్లులకు పోస్ట్ మార్టం చేసి నేరస్థులను పట్టుకోవాలని పోలీసులుకు ఫిర్యాదు చేశారు.. మరి ఈ విషయం పైన పోలీసులు ఇలా స్పందిస్తారో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here