ఆదిమానవుని నుంచి అభివృద్ధి చెందిన మన వరకు పశుపక్షాదులతో విడదీయరాని బంధమే ఉంది.. ఒకప్పుడు మనిషి మనుగడకి మూగజీవులు ఎంతగానో దోహద పడ్డాయి.. ఈ రోజు ప్రతిపనికి యంత్రాలని నమ్ముకుంటున్న మనం ఒక్కసారి గతాన్ని చూస్తే తెలుస్తుంది మూగజీవులు మనిషి మనుగడలో ఎంతటి ప్రధాన పాత్ర పోషించాయని.. అయితే మారిన కాలంతో పెరిగిన వేగంతో మనం యంత్రాలకి అలవాడు పడ్డాము.. మూగజీవులని మన పనులలో ఉపయోగించుకోవడం మానేసాం.. అయితే ఇప్పుడుకూడా కొందరు వ్యాపార నిమిత్తం మూగ జీవులని పెంచుతుంటే మరికొందరు ఇష్టంతో పెంచుకుంటున్నారు..
కొందరు కుక్కలని, మరికొందరు పిల్లులని ఇలా ఎవరికి నచ్చినదాన్నివాళ్ళు పెంచుకుంటున్నారు.. పెంచడం అంటే ఏదో వేళకి ఇంత ముద్ద పెట్టి వాటి ఆకలి తీర్చడమే కాదు.. ప్రేమతో వాటి ఆలనా పాలన చూస్తున్నారు.. సొంత పిల్లలని పెంచినట్టు అల్లారుముద్దుగా పెంచుతున్నారు.. వాటికి ఏదైనా అయితే విలవిలలాడి పోతున్నారు..కొందరు పెంపుడు జంతువులే వాళ్ళ ఆరోప్రాణంగా బ్రతుకుతున్నారు అంటే అతిశయోక్తి కాదు ఇలాంటి ఘటనే ముషీరాబాద్ లో చోటు చేసుకుంది..
ముషీరాబాద్ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ మేకపిల్లని ఎంతో ప్రాణప్రదంగా పెంచుకుంటుంది.. కాగా అది శుక్రవారం నుండి కనిపించలేదు.. దానితో ఊరంతా వెతికింది అయినా ఎక్కడ దాని ఆచూకీ దొరకలేదు.. దీనితో ఆ మహిళ పోలీసులని ఆశ్రయిచింది.. తాను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మేకపిల్ల కనిపించట్లేదని.. ఊరంతా వెతికిన అక్కడ దొరకలేదని ఎలాగైనా వెతికి నా మేకపిల్లని నాకు తెచ్చివ్వండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీని పైన స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని సి.సి. ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు