తోబుట్టువులు కడవరకు తోడుండరు.. కన్నవాళ్ళు కడవరకు ఉండలేరు.. కష్టమైన సుఖమైనా కడవరకు కలిసి నడిచే వాళ్ళే భార్యభర్తలు.. పెళ్ళైన కొత్తలో దంపతుల మధ్య ప్రేమ ఉంటుంది.. కానీ ఆ బంధం బలపడే కొంది ప్రేమకి భాద్యత తోడవుతుంది.. ఆ భాద్యత ఎన్ని కష్టాలొచ్చినా కలిసి ఎదురుకునేలా చేస్తుంది..
అందుకే పెళ్లికి జీవితంలో చాలా ప్రాధాన్యత ఇస్తారు చాలామంది.. కానీ కొందరు పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే అని అభిప్రాయంతో ఉంటారు.. ఎవరి ఇష్టం వాళ్ళది.. కానీ మరో రకం ఉన్నారు వీళ్ళకి పెళ్లి పైన మంచి అభిప్రాయం ఉంటుంది.. కానీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే అమ్మాయి తో నాకు సెట్ కాదేమో అనుకునే అబ్బాయిలు కొందరైతే.. ఆ వచ్చే అబ్బాయితో నేను సర్దుకుపోలేనేమో అత్తా మామలతో కలవలేనేమో అని భయపడే అమ్మాయిలు కొందరు.. ఈ కోవలోకే వస్తారు నటి కౌసల్య..
అల్లుడుగారు వచ్చారు సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు కౌసల్య.. ఆతరువాత పంచదార చిలక చిత్రంలో శ్రీకాంత్ సరసన నటించారు.. కాగా ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.. దీనితో తెలుగు తెరకి దూరం అయిన కౌసల్య తమిళ్ మరియు కనడ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. తిరిగి గౌరీ సినిమాలో నరేష్ భార్య పాత్ర తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో సెంకండ్ ఇండింగ్స్ ప్రారంభించారు.. ఆ తరువాత రారండోయ్ వేడుక చూదాం సినిమాలో హీరోయిన్ తల్లి పాత్ర పోషిచారు..
తాజాగా ఆమె మాట్లాడుతూ 43 సంవత్సరాలు వస్తున్న ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఆమె స్వయంగా చెప్పారు.. ఆమె మాట్లాడుతూ.. ఎందుకో ఆ రిలేషన్ నాకు అస్సలు సెట్ కాదనిపించింది.. అత్తమామలతో నేను సరిగ్గా ఉండగలనా? లేదో అనే సందేహం కూడా కలిగింది. ఇలా అనేక ఆలోచనలు నన్ను పెళ్లి అంటే భయానికి గురి చేశాయి. ఇక అనారోగ్యం, బరువు పెరగడం, చేసిన సినిమాలు అంతగా ప్రేక్షకులని ఆకట్టుకోకపోవడంతో నేను అన్ని విషయాల నుండి బ్రేక్ తీసుకున్నాను అని పేర్కొన్నారు..