Allu Arjun : ఆరోజు తీసుకున్న నిర్ణయం.. ఈ రోజు ఈ స్థాయిలో ఉంచింది.. అల్లుఅర్జున్

0
31

అల్లు అరవింద్ తనయుడిగా తెరంగేట్రం చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లుఅర్జున్.. గంగోత్రి చిత్రం తో చిత్ర సీమకు పరిచయం అయ్యారు.. ఆ సినిమా చూసిన వాళ్లలో చాలామంది ఇతను హీరో ఏంటి అనే విమర్శలు చేశారు.. విమర్శించిన వాల్లే ప్రశంసించేలా పుష్ప సినిమాతో జాతీయ అవార్డుని కైవసం చేసుకున్నారు అల్లు అర్జున్..

ఇక అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే వీరి కంబినేషన్లో సినిమా వస్తుందంటేనే ప్రేక్షకులలో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతాయి.. ఇప్పటికే ఆర్య, ఆర్య 2 , పుష్ప వంటి సినిమాలు చేసి భారీ విజయాన్ని పొందారు.. ఇక తాజాగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

నేను ఆర్య సినిమా సమయంలో చాల కథలు విన్నాను.. కానీ ఎందుకో సుకుమార్ చెప్పిన ఆర్య కథకే కనెక్ట్ అయ్యాను.. అదే సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యాను.. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడంవల్లనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను.. నేను ఎప్పటికి సుకుమార్ కి రుణపడి ఉంటాను అని తన అభిప్రాయాలని వ్యక్తపరిచారు అల్లు అర్జున్..

నేను హీరోగా నిలదొక్కుకున్న తర్వాత నేను ఒక స్పోర్ట్స్ కారును కొనుగోలు చేయడానికి దాదాపు 85 లక్షల రూపాయలు ఖర్చు చేశానని అల్లు అర్జున్ తెలిపారు.. ఆ కారు స్టీరింగ్ పట్టుకున్న సమయంలో సుకుమార్ వల్లనే కదా నాకు ఈ కారును కొనుగోలు చేయడం సాధ్యమైంది అని అనిపించిందని అల్లు అర్జున్ తెలిపారు.. కాగా ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here