‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. ఏం చేస్తున్నాయో చూడండి..వీడియో

0
126

మామూలుగా మనం రోజు ఇంట్లో చీమలను చూస్తునే ఉంటాం. మనం తినగా కింద పడిపోయిన ఆహార పదార్థాలను వాటి గూటికి తరలిస్తూ మనకు ఎన్నోసార్లు కనిపించి ఉంటాయి. అయితే.. చీమలు వాటి స్వంత శరీర బరువు కంటే 10 నుండి 50 రెట్లు ఎక్కువ మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఒక చీమ తన బరువు కంటే 50 రెట్లు ఎత్తగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే ఒక చీమల గుంపు కలిస్తే ఒక పెద్ద వస్తువును కూడా తరలించగలవు. ఇది ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని పెంచే విషయం కూడా. ఓ చీమల గుంపు బంగారు గొలుసును లాక్కెళ్లుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఓ చీమల గుంపు నేలపై పడి ఉన్న బంగారం గొలుసును తరలించుకుపోతున్నాయి.

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘చిన్న బంగారం స్మగ్లర్లు’ అనే క్యాప్షన్‌తో నందా ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఐపీఎస్‌లోని ఏ సెక్షన్ కింద వారిని బుక్ చేయవచ్చు..? అనే ప్రశ్నను కూడా సంధించారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here