సూపర్ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమై లేడీ సూపర్ స్టార్ గ ఎదిగింది అనుష్క శెట్టి.. తెలుగులో దాదాపు అగ్ర హీరో లందరి సరసన ఆడిపాడి అలరించింది ఈ భామ.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులని మెప్పించింది ఈ తార.. కాగా చాల కాలం తర్వాత ఈ అమ్మడు “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమాతో మరోసారి ప్రేక్షకులముందుకు రానుంది.. దర్శకుడు మహేష్ బాబు దర్సకత్వంలో యువి క్రియేషన్స్ పతాకం పైన నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 7 తేదీన విడుదల కానుంది..
విడుదల డేట్ దగ్గర పడుతున్న కొద్ది మేకర్స్ ప్రమోషన్స్ ని ముమ్మరం చేస్తున్నారు.. ప్రమోషన్స్ లో అనుష్క పాల్గొనను అని ముందే చెప్పడంతో ఆ బాధ్యత నవీన్ పోలిశెట్టి తన భుజాన వేసుకున్నారు.. కాగా ఈ చిత్రానికి సంబంధిచి అనుష్క ఒక ఇంటర్వ్యూ ఇవ్వనుందనే వార్త ఎప్పటినుండో వినిపిస్తుంది..
కాగా తాజాగ ఆ ఇంటర్వ్యూ షూట్ జరిగిందని తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో ఆమె తన పెళ్లి గురించి, ప్రభాస్ గురించి, సినిమాల గురించి ఎన్నో ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది.. ప్రభాస్ తో మళ్ళీ సినిమా ఎప్పుడు చేస్తారు అని అడగగా.. మంచి కథ దొరికితే వెంటనే అని బదులిచ్చింది ఈ బ్యూటీ..
మళ్ళీ ప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో సినిమా రావాలని ఆశపడుతున్న అభిమానులు ఈ మాటతో గాల్లో తేలిపోతున్నారు.. సోషల్ మీడియా వేదికగా రాబోయే చిత్రానికి దర్శకుడు ఎవరా అని కామెంట్స్ చేస్తున్నారు.. కొందరు రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఉండొచ్చని కామెంట్స్ చేస్తుంటే ఇంకొందరు కొరటాల శివ దర్శత్వంలో ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.. మరి అభిమానుల ఆశలను నెరవేర్చే ఆ దర్శకరత్నం ఎవరో చూడాలి..