మనం నిత్యం ఏదో ఒకటి కొంటూ ఉంటాం.. బస్సు టికెట్స్, నిత్యా అవసర వస్తువులు మొదలైనవి కొన్నప్పుడు డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది..కొన్నిసార్లు చిల్లర ఇచ్చేటప్పుడు చినిగిపోయిన నోట్లు ఇస్తుంటారు.. ఆ సమయంలో చూసుకోకుండా తర్వాత చూసుకుంటాం..ఇంకొన్ని సార్లు అనుకోకుండా నోట్లు చినిగిపోతాయి.. చినిగిన నోటు ఎలా వచ్చిన దానితో ఇబ్బంది పడుతుంటారు.. ఎందుకంటే చిగిన నోటు చెల్లదు.. కనుక ఎవరు తీసుకోరు.. కొందరు మాత్రం కమీషన్ తీసుకొని ఆ నోటుని మార్చి ఇస్తారు..
కానీ ఆలా కమీషన్ ఏమి చెల్లించకుండానే మీరు మీ చిగిన నోటుని మార్చుకోవచ్చు.. ఎక్కడ అనుకుంటున్నారా..? బ్యాంకు లో.. అవును RBI రూల్ ప్రకారం ఎవరైనా చినిగిన నోట్లను బ్యాంకు లో మార్చుకోవచ్చు.. దీని కోసం ఆ బ్యాంకు లో మీకు అకౌంట్ ఉండనవసరంలేదు.. అంతే కాదు ఎలాంటి అప్లికేషన్ కూడా రాయనవసరం లేదు.. అయితే ఒకసారికి 20 నోట్లు మాత్రమే మార్చడానికి అవుతుంది..అది కూడా ఆ నోట్ల విలువ రూ/ 5000 లోపలే ఉండాలి..
అలా కానీ పక్షంలో డ్యామేజ్ ఎక్కువగా అయితే మాత్రం పర్సంటెజ్ ప్రకారం డబ్బులను ఇస్తారు..అంటే 78 శాతం బాగుంటే దానికి ఫుల్ అమౌంట్ ఇస్తారు.. అదే నోటు 39 శాతం ఉంటే దానికి కేవలం సగం డబ్బులను మాత్రమే ఇస్తారు.. ఒకవేళా మీ దగ్గర చిరిగిన నోట్లు ఎక్కువగా ఉంటే బ్యాంకు వెంటనే మార్పిడి చేయదు, మొదట ఆ నోట్లను స్వీకరించి.. తరువాత మీ ఖాతాలో జమ చేస్తుంది.. అలానే కావాలని చించిన నోట్లకి ఎలాంటి డబ్బులు ఇవ్వబడవు ..