వేద్యో నారాయణో హరిః అంటారు పెద్దలు..అంటే వైద్యులు దేవునితో సమానం అని.. ఎందుకంటే ప్రాణం పోతుంది అనుకునే రోగికి కూడా వాళ్ళ వైద్యంతో ఆయువు పోసేవారు వైద్యులు.. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది.. హాస్పిటల్ కి వెళ్తే తిరిగొస్తామన్న గ్యారెంటీ లేదు అంటున్నారు ప్రజలు..
దీనికి కారణం ప్రైవేట్ హాస్పిటల్ వాళ్లకి ప్రాణం కంటే పైసా ముఖ్యం.. సరేనని ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్తే ఆ డాక్టటర్ల కి అక్కడి సిబ్బందికి నిర్ల్యక్షం ఎక్కువ.. అందరు డాక్టర్లు ఇలానే ఉన్నారని కాదు గంజాయి వనంలో తోలసి మొక్కల అక్కడక్కడా మంచి డాక్టర్లు, నర్సులు ఉన్నారు.. కానీ ఎక్కువమంది ఇలానే ఉన్నారు.. ప్రభుత్వ హాస్పిటల్ లు లేదా ప్రయివేట్ హాస్పిటల్ ఎక్కడికి వెళ్లాలన్న భయపడుతున్నారు ప్రజలు.. తాజాగా ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం ఓ బాలింతరాలి ప్రాణాల మీదకి తెచ్చింది..
మంచిర్యాల ప్రభుత్వాసుపత్రి లో ఆ ఘటన చోటుచేసుకుంది.. వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తి గర్భవతి.. 5 రోజులక్రితం నెలలు నిండడంతో పురిటి నొప్పులు వచ్చాయి.. దీనితో కుటుంబ సభ్యులు ఆమెని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రి లో చేర్పించారు.. మామూలు కాన్పు కష్టమని ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు.. అయితే కీర్తి లయ తీవ్ర అస్వస్థతకు గురి కాగా సోమవారం రాత్రి ఆమె పరిస్థితి విషమించింది.. దీనితో ఆమెని చెన్నూరు ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు..
అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్లు ఆ బాలింత కడుపులో దూది ఉండడం గుర్తించి షొక్ అయ్యారు.. ఈ విషయాన్ని బాలింత కుటుంబ సభ్యులకి చెప్పగా వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ప్రసవం చేయమంటే ప్రాణాలు తీస్తారా అని మండిపడటంతో ఈ వార్త వెలుగు చూసింది..