చలన చిత్ర పరిశ్రమ ఎవరిని ఎప్పుడు ఏ స్థాయికి తీసుకెళ్తుందో చెప్పలేం.. కెరీర్ పీక్స్ లో ఉన్నవాళ్ళని పాతాళానికి పడేయాలన్న.. అధఃపాతాళంలో ఉన్న వాళ్ళని అందలం ఎక్కించాలన్న ఒక్క చలన చిత్ర పరిశ్రమకే సాధ్యం.. ఇక హీరోయిన్స్ గురించి తెలిసిందే కొత్త నీరు వస్తే పాత నీరు పోక తప్పదన్న సామెత.. ఇది తెలుసున్న కొందరు భామలు దీపం ఉండగగానే ఇల్లు చక్కదిద్దుకుంటారు.. మరికొందరు ఆ విషయం ఆలస్యంగా తెలుసుకుని అడపాదడపా సినిమాలు చేసుకుంటూ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు.. ఆ కోవలోకే వస్తుంది నటి అను ఇమ్మానియేల్..
నాని నటించిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.. ఆ తరవాత స్టార్ హీరోల సరసన మెరిసిన అంతగా కలిసిరాలేదనే చెప్పాలి ఈ భామకి.. వరుస ఫ్లాప్స్ రావడంతో తెలుగు లో అవకాశాలు తగ్గిపోయాయి ఈ బ్యూటీకి.. కాగా తెలుగులో అడపాదడపా సినిమాలు చేసిన అవేమి అంత బ్రేక్ ఇవ్వలేదనే చెప్పాలి.. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్ హీరో కార్తీ సరసన జపాన్ చిత్రంలో నటిస్తుంది..
కాగా తాజాగా ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంబుగా ఇంటర్వ్యూ ఇచ్చిన అను ఇమ్మానియేల్ ఆసక్తికర వాఖ్యలు చేసింది.. కాస్టింగ్ కౌచ్ ని ఎదురుకున్నానని ఒక నిర్మాత తన శారీరక వాంఛలు తీర్చాల్సిందిగా ఇబ్బంది పెట్టారని అయితే నా కుటుంబ సహకారంతో బయటపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది..
అంతేకాకుండా అను ఇమ్మానియేల్ ఒక యంగ్ హీరో తో ప్రేమలో ఉన్నదీ అంటూ సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయని.. అవిచూసి మా అమ్మ చాలా బాధ పడింది.. ఆ వార్తల్లో వాస్తవం లేదు.. నేను ఎవరితో ప్రేమలో లేను దయచేసి ఇలాంటి వార్తలని వైరల్ చేయకండి అంటూ తన అనుభవాన్ని మరియు అభిప్రయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.. ఇప్పుడు ఆమె చేసిన ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..