జక్కన్న గా పేరుగాంచిన దర్శక ధీరుడు రాజమౌళి గురించి పరిచయం అవసరంలేదు.. తెలుగు చిత్ర పరిశ్రమను యావత్ ప్రపంచానికి చాటిన ఘనత ఆయనది.. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనే మాటకి నిలువెత్తు నిదర్శనం ఈ దర్శకరత్నం.. సినిమాలు తియ్యడంలోనే కాదు మానవత్వాన్ని చాటుకోవడంలోనూ ఆయనకి ఆయనే సాటి..
పెళ్ళై భర్తతో విడాకులు తీసుకున్న రమని ప్రేమిచి పెళ్లిచేసుకున్నారు రాజమౌళి.. కాగా అప్పటికే రమకి కార్తికేయ అనే కొడుకు ఉన్నాడు.. రమ కొడుకునే తన కొడుకుగా భావించారు రాజమౌళి.. అందుకే మళ్ళీ రామతో పిల్లల్ని కనలేదు.. అంతేకాదు మయూకా అనే ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుతున్నాడు..
కాగా తాజాగా రాజమౌళి మళ్ళీ తండ్రి కాబోతున్నాడు అనే వార్త సినీవర్గాల నుండి వినిపిస్తుంది.. అయితే రమరాజమౌళి గర్భవతి కాదు.. మరి రాజమోళి తండ్రి ఎలా అవుతున్నారు అనేగా సందేహం.. రాజమౌళి మరో అమ్మాయిని దత్తతు తీసుకోనున్నారు అనే వార్త చక్కర్లు కొడుతుంది.. రాజమౌళికి ఆడపిల్లలంటే ఇష్టం ఈ కారణంతోనే మరో ఆడపిల్లని దత్తతు తీసుకోవాలి అనికుంటున్నారంట..
ఈ వార్తలో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఏది నిజమో తెలియాలంటే జక్కన్న చెప్పేవరకు ఆగాల్సిందే.. సినిమాల విషయానీకొస్తే.. మహేష్ బాబుతో త్వరలోనే సినిమానుపట్టాలెక్కించబోతున్నాడు..కడుపున పుట్టిన బిడ్డ ఆడపిల్ల అయితేనే తల్లిదండ్రులు బాధపడిపోతున్నారు.. ఆడపిల్లని బరువుగా భావిస్తున్నారు.. అలాంటిది రాజమౌళి ఆడపిల్లల్ని దత్తతు తీసుకొని వాళ్ళ ఆలనా పాలన చూసి పెంచి పెద్దచేస్తున్నారంటే నిజంగా గొప్పవిషయమే..