Sai Pallavi: ఈ హీరోయిన్ కాదంటేనే కంగనా కి అవకాశం వచ్చిందా..!?

0
44

అందం అభినయం కలగలిసిన నటి సాయి పల్లవి.. ఒక డాన్సర్ గా బుల్లితెర మీద తన ప్రతిభను చాటిన పల్లవి ఆ తరువాత వెండితెర మహారాణిగా మారారు.. పాత్రకి ప్రాధాన్యత ఉంటె ఆ పాత్రని చేయడానికి అంగీకరిస్తారు సాయి పల్లవి.. ప్రాధాన్యత లేని పాత్రకి.. గ్లామర్ రోల్స్ చేయడానికి అసలు ఒప్పుకోరు.. అవకాశాలకోసం తనని తాను దిగజార్చుకోదు సాయి పల్లవి.. స్వతహాగా డాక్టర్ అయినా సాయి పల్లవి అవకాశాలు లేకపోతే క్లినిక్ పెట్టుకుంటాను గాని నా ఫ్యామిలీ తలదాచుకునే పాత్రలు మాత్రం చేయను అని సున్నితంగా చెప్తారు..

కాగా తాజాగా చంద్రముఖి సీక్వెల్ గా పీ.వాసు తెరకెక్కిస్తున్న చంద్రముఖి 2 టైటిల్ రోల్ కి మొదట సాయి పల్లవిని సంప్రదించారట మేకర్స్.. కానీ అనివార్య కారణాలవల్ల సాయి పల్లవి తిరస్కరించగా.. ఆ అవకాశం కంగనాని వరించింది అనే వార్తలు సినీ వర్గాలనుండి వినపడుతున్నాయి..

ఈ సినిమా ని సాయి పల్లవి చేసి ఉంటె వేరే లెవెల్ లో ఉండేదని.. కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరియు డాన్సర్ సాయి పల్లవి కలిసి ఏదైనా పాటకి ఆడిపాడి ఉంటె కనుల విందుగా ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. 2005 లో విడుదలైన చంద్రముఖి హార్రర్ జోన్ చితాలకి ఒక బెంచ్ మార్క్ గా మిగిలిపోయింది.. ఉత్కంఠ భరిత సన్నివేశాలతో ప్రేక్షకులని అలరించింది.. భయానికి భయాన్ని చూపించి భయానక చిత్రం అంటే ఇలా ఉండాలి అని విమర్శకుల ప్రశంసలు పొందింది.. మరి దీని సీక్వెల్ గా సెప్టెంబర్ 19 న ప్రేక్షకుల ముందుకి వస్తున్న చంద్రముఖి 2 ప్రేక్షకులని అలరిస్తుందో లేదో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here