సూపర్ స్టార్ కృష్ణ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు బాలనటుడిగా తెరంగేట్రం చేసి ప్రిన్స్ మహేష్ బాబుగా ఎదిగారు.. నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఎలాంటి గొడవలకి వెళ్ళరు.. ఎవరితోనూ గిల్లికజ్జాలు పెట్టుకోరు.. తన పని తాను చేసుకుపోయే మహేష్ బాబు సమాజంపట్ల ఎంతో భాద్యతగా ఉంటారు.. సమాజానికి తనవంతు సాయం చేస్తారు.. ఎంబి ఫౌండేషన్ ని స్థాపించి దాని ద్వారా వందలమంది పిల్లలకి గుండె ఆపరేషన్లు చేపించారు.. వైద్యం చేయిస్తున్నారు..
ఈ సంస్థ కార్యకలాపాలు అయన అర్ధాంగి నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు.. ఆయన పిల్లలు కూడా తండ్రికి తగ్గ బిడ్డలు అనిపించుకుంటున్నారు..తాజాగా ఆయన తనయురాలు సితార తన పుట్టునరోజు సందర్భంగా పేద విద్యార్ధులకి సైకిల్ లు పంచిపెట్టింది..తాను ఒక యాడ్ లో నటించగా ఆ యాడ్ ఏజెన్సీ నుండి అందుకున్న పారితోషకాన్ని కూడా ఆ పౌండేషన్ కె ఇచ్చింది..
తాజాగా మహేష్ బాబు తనయుడు గౌతమ్ టీవల కొన్ని రోజుల క్రితం రెయిన్ బో హాస్పిటల్స్ ను సందర్శించి ఎంబీ ఫౌండేషన్ ద్వారా చికిత్స చేయించుకున్న పిల్లలను గౌతమ్ పలకరించాడు. ఆ ఫోటోలను ఎంబీ ఫౌండేషన్, నమ్రతా తమ సోషల్ మీడయా ఖాతాలలో షేర్ చేస్తూ గౌతమ్ ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది అని ఆమె పోస్ట్ చేసారు.. ఈ పోస్ట్ కి తండ్రికి తగ్గ తనయుడు .. అని తండ్రి బాటలో నడుస్తున్న తనయుడని పలురకాల కామెంట్స్ పెడుతున్నారు ప్రేక్షకులు..