దర్శకుడు బోయపాటి శ్రీను దర్సకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోయిన్ శ్రీలీల జంటగా తెరకెక్కిన చిత్రం స్కంద.. ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్లు.. పాటలు విడుదలై అశేష ప్రేక్షక ఆదరణను అందుకుంటున్నాయి.. కాగా వినాయక చవితి సందర్భగా సెప్టెంబర్ 17 ఈ చిత్రం విడుదలై ప్రేక్షకులని అలరించనుంది..
ఇక ఈ చిత్ర బృదం ప్రమోషన్స్ లో భాగంగా శిల్పకల వేదికలో ప్రీ రీలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకకి బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేసారు.. అతిధిగా వచ్చిన బాలకృష్ణ స్కంద ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. భగవత్ శ్లోకంతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు బాలకృష్ణ..
అనంతరం స్కంద చిత్రం గురించి ఆయన ప్రసంగిస్తూ ముందుగా స్కంద అని టైటిల్ పెట్టినందుకు ఆయనకీ చాలా సంతోషం గా ఉందని హర్షాన్ని వ్యక్తం చేసిన ఆయన స్కంద అనే టైటిల్ కి శిరసు వంచి వందనం చేస్తున్న అని చెప్పారు.. తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను గురించి ప్రశంస పూర్వకంగా మాట్లాడిన ఆయన రామ్ పోతినేని నాకు ఛాలెంజ్ విసిరారు.. తెలంగాణా యాసలో ఇస్మార్ట్ శెంకర్ చేసారు.. ఇప్పుడు ఆయన బాటలో నేనో తెలంగాణా సినిమా చేస్తుంటే మళ్ళీ అయన నన్ను ఫాలో అవుతూ భక్తిపూర్వక సినిమాని చేస్తున్నారు అని మాట్లాడారు..
ఈ వాక్యలపైనా హీరో రామ్ స్పందిస్తూ మీరు ఈ స్కూల్ కి హెడ్ మాస్టర్ అయితే నేను విద్యార్థిని అని బదులిచ్చారు..తర్వాత ప్రసంగాన్ని కొనసాగించిన బాలకృష్ణ ఆ చిత్రం బృందం అందరి గురించి పేరు పేరున మాట్లాడారు.. చివరిగా చలన చిత్ర పరిశ్రమ అనేది ఒకటే కుటుంబం మాది ఒకటే కులం అని తన అభిప్రాయాన్ని వెల్లడించిన ఆయన ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరూ జాగ్రత్తగా వెళ్ళండి అనిసూచిస్తూ ఎవరి సినిమానైనా ఆదరిస్తున్న ప్రేక్షకులకి అలానే తనని వేడుకకి ఆహ్వాఆనించిన స్కంద చిత్రం నిర్మాతకి మరియు దర్శకునికి తన కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగాన్ని ముగించారు..ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..