నందమూరి తారక రామ రావు నటవారసులుగా ఎందరో వెండి తెరకి పరిచయం అయినా కేవలం sr.ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ మరియు మనవడు jr .ఎన్టీఆర్ వెండితెరని ఏలుతుండగా కళ్యాణ్ రామ్ పర్లేదు అనిపించుకుని బింబిసారా చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు.. కాగా బాలకృష్ణ అభిమానులంతా నందమూరి నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు..
కానీ వినాయకుడి పెళ్లి ఎప్పుడు అంటే రేపు అన్నట్టు ఉంది మోక్షజ్ఞ తెరంగేట్రం.. బాలయ్య మాత్రం మోక్షజ్ఞ ఎట్రీ ఇస్తున్నాడు అని అప్పుడప్పుడు చెప్తుంటారు.. మంచి డైరెక్టర్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని.. ఆ పనుల్లోనే ఉన్నట్టు అప్పుడప్పుడు బాలయ్య హింట్ ఇస్తుంటారు.. కాగా ఇంతకముందు ఒకసారి మోక్షజ్ఞ బొద్దుగా ఉన్నాడని, హీరోల లేడనే విమర్శలు తలెత్తాయని అందుకే మోక్షజ్ఞ తనని తను మార్చుకునే పనిలో పడ్డాడనే వార్తలు వినిపించాయి..
కాగా మోక్షజ్ఞ తాజాగా తండ్రి నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి సెట్ లో మెరిశారు.. మోక్షజ్ఞ పూర్తిగ మారిపోయారు.. బొద్దుగా ఉండే మోక్షజ్ఞ చాలా తగ్గి యంగ్ హీరో ఎలా ఉండాలో అలానే ఉండి తేజస్సుతో వెలిగిపోతున్నారు.. కాగా దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గ మారాయి..
కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి.. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది.. ఇప్పటికే ఈ చిత్రంకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు అభిమానులతో పాటు అందరిని ఆకట్టుకుంటున్నాయి.. కాగా ఈ చిత్రం అక్టోబర్ 19 న ప్రేక్షకులని అలరించనుంది..