Naveen Krishna: నానమ్మ ఆస్తి నాకు రాయలేదు..! విజయ నిర్మల మనవడు

0
27

అలనాటి నటి విజయ నిర్మల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. నటిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యిన విజయ నిర్మల దర్శకురాలిగా, నిర్మాతగా కూడా ఎన్నో సంచలనాత్మక చిత్రాలను తీసి లెజెండరీ ఆక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా పేరుతెచ్చుకుంది.. పేరు తోపాటు ఆస్తులు కూడా కూడబెట్టింది.. కాగా తాజాగా విజయ నిర్మల ఆస్ధి ఎవరికీ రాసింది అనేదానిపై ఆమె మనవడు నవీన్ కృష్ణ సంచలన వాఖ్యలు చేశారు..

వివరాలలోకి వెళ్తే విజయ నిర్మల బ్రతికున్నప్పుడే మనవడిని హీరోని చేయాలనుకుంది.. ఆ నేపథ్యంలో నవీన్ కృష్ణ మూడు నాలుగు సినిమాలు చేసినా హీరోగా గుర్తింపు రాలేదు.. దానితో సినిమాలకి విరామం ఇచ్చిన నవీన్ కృష్ణ తాజాగా “ది సోల్ ఆఫ్ సత్య” అనే మ్యూజిక్ ఆల్బమ్ తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు..

ఇందులో సాయిధరమ్ తేజ్, స్వాతి జంటగా నటిచ్చారు .. ఆగష్ట్ 15న విడుదలైన ఈ పాట మంచి గుర్తింపుని పొందింది.. దీనితో మరోసారి వెలుగులోకి వచ్చారు నవీన్.. ఇక పాట విజయవంతం అయ్యాక చాల ఇంటర్వూస్ లో పాల్గొన్న నవీన్ తన గురించి వాళ్ళ నాన్న నరేష్ గురించి మాట్లాడుతూ.. నేను నాన్న సంపాదించింది ఎం లేదు.. అంత నానమ్మ సంపాదించిన ఆస్తే..

నాకు ఆస్తి అంతస్థులమీద ఆసక్తి లేదు అసలు పట్టించుకోను.. నానమ్మ ఉన్నప్పుడే ఆస్తిలో సగం నాకు సగం నాన్నకి విల్లురాయలనుకుంది.. కానీ నేను నాన్న ఒక నిర్ణయానికి వచ్చాక ఆస్తిని నాన్న పేరు మీదనే రాసింది.. ఇప్పుడు ఆస్తి నాన్న పేరుమీద ఉంది.. అది నానమ్మ ఆస్తి..దానికి నాన్న గార్డియన్.. అనంతరం ఆస్తిని పర్యవేక్షించే బాధ్యతలు నామీదనే పడతాయి.. ఈ మాట నాన్న కూడా చాలా సార్లు అన్నారు అని నవీన్ తెలిపారు .. నవీన్ కృష్ణ చేసిన ఈ వాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here