peddakapu Movie Updates: శ్రీకాంత్ అడ్డాల ఖాతాలో మరో మాస్ చిత్రం.. పెదకాపు అప్డేట్స్

0
113

టాలీవుడ్ లో ప్రస్తుతం దర్శకుల హావా నడుస్తుంది.. దర్శకులు సినిమాల పరంగా నువ్వా.. నేనా.. అని పోటీపడి మరి కథలను ఎంచుకుంటున్నారు.. ఒకప్పుడు మాస్ సినిమాల డైరెక్టర్ క్లాస్ సినిమాల డైరెక్టర్ అంటూ ఉండేవారు.. ఇప్పుడు ఆ తీరు మారింది.. ట్రేండింగ్ టైంని బట్టి అన్ని రకాల సినిమాలు చేస్తున్నారు దర్శకులు.. ఈ కోవలోకే వస్తారు శ్రీకాంత్ అడ్డాల..

ఒకప్పుడు వరుస క్లాస్ చిత్రాలు చేసిన ఈ దర్శకుడు నారప్ప చిత్రంతో తనలోని మాస్ యాంగిల్ ని ప్రేక్షకులకి చూపించాడు.. కాగా మరోసారి తనలోని మాస్ యాంగిల్ ని బయటకు తియ్యనున్నారు శ్రీకాంత్ అడ్డాల.. ప్రస్తుతం ఉన్న రాజకీయాలకి అనుగుణంగా చిత్రాన్నినిర్మిస్తున్నారు.. ఆ చిత్రమే ద్వారకా క్రియేషన్స్ పతాకం పైన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం పెదకాపు…

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ చూస్తే ఓ పొలిటికల్ త్రిల్లర్ గా ఈచిత్రం ఉండబోతుంది అని తెలుస్తుంది.. ఇదివరకే నారప్ప చిత్రం ద్వారా భారీ విజయాన్ని అందుకున్న ఈ దర్శకరత్నం ఇప్పుడు మరోసారి యుంగ్ అండ్ టాలెంటెడ్ విరాట్ కర్ణతో పెదకాపు సినిమా ని తెరకెక్కిస్తున్నాడు..

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ విశేష జనాకర్షణను కైవసంచేసుకుంది.. కాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసేందుకు ఈ సినిమా మేకర్స్ సుముహూర్తం నిశ్చయించారు.. కాగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ఈ సినిమా మేకర్స్ సుముహూర్తం నిశ్చయించారు.. ఈ నెల 29వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.. సెన్సేషనల్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి “మిక్కీ జే మేయర్” సంగీతం అందించారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here