బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖాన్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో బాలీవుడ్ ని షేక్ చేసి బాద్షా గా ఎదిగారు షారుఖాన్.. షారుఖాన్ సినిమా రిలీజ్ అవుడుతుంది అంటేనే అభిమానులతో పాటు అందరిలోనూ అంచనాలు తార స్థాయికి చేరుతాయి..
ఇక పోతే షారుఖాన్ ప్రమోషన్స్ లో పాల్గొనరు.. అలాంటిది జవాన్ మూవీని ఆయనే ప్రమోషన్ చేసారు.. ప్రమోషన్స్ లోనే మంచి హైప్ ని సాధించింది జవాన్ సినిమా.. ఎంతలా అంటే 5 లక్షల ప్రీబుకింగ్స్ ని కైవసం చేసుకుంది.. ప్రేబుకింగ్స్ తోనే 70 కోట్లు రాబట్టింది జవాన్ చిత్రం..బాహుబలి 2, KGF 2 తర్వాత ఈ రేంజ్ ప్రీబుకింగ్స్ రాబట్టిన సినిమా జవాన్..
దీనితో సింగల్ స్క్రీన్స్ తో కలిపితే ఓవరాల్ గా డే 1 వంద కోట్ల కలెక్షన్స్ ని రాబట్టడం పక్కా అని బీటౌన్ ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి. ఇదే నిజమైతే బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల ఓపెనింగ్ రాబట్టిన బాలీవుడ్ హీరోగా మరియు ఒకే ఏడాదిలో రెండు సార్లు వంద కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని రాబట్టిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేయనున్నాడు షారుఖాన్..
ఇప్పుడున్న ట్రెండ్ ని బట్టి చూస్తే జవాన్ సినిమా వెయ్యి కోట్ల మార్కెట్ ని ఈజీగా టచ్ చేస్తుంది. అక్టోబర్ 19 వరకూ జవాన్ సినిమాకి సౌత్ నుంచి వచ్చే కష్టం లేదు, నార్త్ లో అసలు జవాన్ కి పోటీనే లేదు కాబట్టి జవాన్ ఫైనల్ కలెక్షన్స్ ముందెన్నడూ చూడని సెన్సేషన్ క్రియేట్ చేయనుంది