యూట్యూబ్ కాలక్షేపాన్నే కాదు ఎందరో కళాకారులకి జీవితాన్ని ఇచ్చిన గొప్పవేదిక అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. ఎదుకంటే యూట్యూబ్ లో కెరీయర్ ని ప్రారంభించి వేడితెర మీద మెరుస్తున్న కళాకారులు ఎందరో ఉన్నారు..ఆ కోవలోకే వస్తారు కమెడియన్ మహేష్ విట్టా..
ఫన్ బకెట్ ద్వారా కెరియర్ ని ప్రారంభించారు మహేష్ విట్టా.. ఆయన చింతూరు యాసలో చెప్పే డైలాగ్స్ అందరిని నవ్వించాయి.. దీనితో ఆయనకి మొదటి సారిగా నాని హీరో గ చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో అవకాశం లభించింది.. తరువాత‘శమంతకమణి’, ‘టాక్సీ వాలా’, ‘నిను వీడని నీడను నేను’, ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ ,‘ఛలో’ ,‘యురేక’, ‘కొండపొలం’ ,‘అల్లుడు అదుర్స్’, ‘సకల గుణాభిరామ’ ,వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తీసుకున్నాడు మహేష్..
ఆతరువాత తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్ గా అవకాశం అందిపుచ్చుకున్నాడు మహేష్.. అతని పెర్ఫార్మన్స్ తో దాదాపు 60 రోజుల వరకు హౌస్ లో ఉన్నాడు.. ’పుష్ప’ సినిమాలో కేశవ పాత్ర మొదట ఇతనికే లభించింది.. కానీ కొన్ని కారణాల వల్ల దానిని మిస్ చేసుకున్నాడు మహేష్..
ఇదిలా ఉండగా.. మహేష్ ఒక ఇంటివాడు అయ్యాడు అనే వార్త సోషల్ మీడియా వేదికగా హల్చల్ అవుతుంది.. వివరాల్లోకి వెళ్తే మహేష్ తన చెల్లి ఫ్రెండ్ అయినటువంటి శ్రావణి ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఆ ఇష్టమే ప్రేమగా మారింది..దీనితో ఇరు కుటుంబాలలో పెద్దల్ని ఒప్పించి ఈ నెల 2 వ తేదీన కడప జిల్లాకు చెందిన ప్రొద్దుటూరులోని హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో ఇరుకుటుంబాల సమక్షంలో కన్నులవిందుగా వివాహం చేసుకున్నారు.. కాగా ఈ వివాహ వేడుకకి కేవలం బంధువులు మాత్రమే విచ్చేసారు.. సినీ ప్రముఖులు ఎవరు హాజరుకాకపోవడం గమనర్హం..వీరిద్దరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇక మహేష్ ప్రస్తుతం కొన్ని సినిమాల్లో చేస్తున్నాడు..