ఏలాంటి సినీ నేపధ్యం లేకుండా చిత్రపరిశ్రమకి పరిచయమై గుర్తింపు తెచ్చుకున్న హీరోలు ఎందరో ఉన్నారు.. ఆ కోవలోకే వస్తారు ఉదయ్ కిరణ్.. నువ్వు నేను అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యారు ఉదయ్.. మొదటి సినిమా తోనే భారీ విజయాన్ని అందుకున్న ఆయన.. ఆ తరువాత ఎన్నో మంచి సినిమాలు చేసి ప్రజలని అలరించి పక్కింటి అబ్బాయిగా మారిపోయారు..
ఒక్కప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు, మిడిల్ క్లాస్ కొడుకుగా రియల్ లైఫ్ లో చూపించాలంటే.. ఉదయ్ కిరణ్ లా ఉండాలంటూ చెప్పుకొచ్చేవారు. అయితే ఎంత త్వరగా పైకి వచ్చారో అంతే త్వరగా అయన మనకి దూరం అయ్యారు.. వివాహానంతరం ఉదయ్ కి అవకాశాలు తగ్గాయి.. అడపా దడపా చిత్రాలు చేసిన అవి అంతగా ఆకట్టుకోలేదు.. దీనితో మనస్తాపానికి గురైన ఉదయ్ తన ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయారు..
అయితే ఆయన మరణానికి సంబధించిన కారాణాలు ఎప్పటికి ప్రశ్నగానే మిగిలాయి.. కాగా టాప్ సింగర్ గా కొనసాగుతున్న పర్ణిక ఉదయ్ కిరణ్ చిన్నమ్మ కూతురు.. అంటే ఉదయ్ కి చెల్లి అవుతుంది.. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పర్ణిక మాట్లాడుతూ అన్నయ్య మంచి మనసున్న వ్యక్తి.. నాదగ్గర ఏది దాచేవాడు కాదు.. ఇలా ఇంత చిన్న వయసులో చనిపోవడం బాధాకరంగా ఉంది ఎప్పుడు నేను అన్నయ్య పేరుని వాడుకోవాలి అనుకోలేదు..అందుకే ఇన్ని రోజులు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు అని తెలిపారు