పవన్ కళ్యాణ్ ఈ పేరులోనే పవర్ ఉంది అంటారు ఆయన అభిమానులు.. అందుకే అయన పవర్ సార్ట్ గా ఎదిగారు.. కోట్లంది అభిమానవుల మనసుల్లో ఒదిగారు.. జనం కోసమే నేనంటూ జనసేన పార్టీని స్థాపించారు.. కాగా ఓ వైపు రాజకీయాల్లో ఉంటూనే మరో వైపు సినిమాలు చేస్తున్నారు..
ప్రస్తుతం ఆయన ౩ సినిమాల్లో నటిస్తున్నట్టు సాంఘీక మాధ్యమాల సమాచారం.. కాగా ఆయన చేస్తున్న ప్రాజెక్టుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి.. ఈ సినిమా చెయ్యాలి అనుకున్న వేళా విశేషమేమోగాని.. అనుకున్నప్పుటినుండి ఇప్పటికి ఈ చిత్రానికి అన్ని అవాంతరాలే.. ఈ సినిమాని అనౌన్స్ చేసాక ఇదో రీమేక్ చిత్రం అనే విమర్శలు అందుకుంది..కాగా తెలుగు ప్రేక్షకులకి నచ్చేటట్లు మార్పులు చేర్పులుచేసినట్లు సినిమా యూనిట్ చెబుతోంది..
కాగా ఈ సినిమాకి దాదాపు 5 నెలల తర్వాత డేట్స్ ఇచ్చారు పవన్..కాగా ఈ చిత్రం షూటింగ్ నిన్న జరగాల్సి ఉంది.. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సోమవారమే పూర్తి అయ్యాయి అని తెలిసేలా మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ అధికారిక హ్యాండిల్ నుంచి హరీష్ శంకర్ ఆయుధాలతో ఉన్న ఫోటో షేర్ చేసి “మనల్ని ఎవడ్రా ఆపేది” అనే క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..
ఎవరో ఏంట్రా నేనున్నాగా అన్నట్టు వరుణుడు కుండపోతగా వర్షం కురిపించాడు.. దీనితో షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తుంది.. కాగా మళ్ళీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభించాలి అనేదానిపైన చరిత్ర బృందం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.. మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు అంటే ఇదేనేమో..