యూట్యూబ్ లో కెరీర్ ని ప్రారంభించి వెండితేర మీద మెరిసిన తార వైష్ణవి చైతన్య.. యూటుబ్ లో అనేక షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సీరీస్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది వైష్ణవి.. కాగా రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమాతో వెండి తెర హీరోయిన్ గా పరిచయం అయ్యారు.. ఆ చిత్రంలో తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది వైష్ణవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..
ఈ చిత్రం బావుంది అనే వాళ్ళు కొందరైతే బాలేదు అనేవాళ్ళు కొందరు.. కానీ విమర్శకులను మరియు ప్రసంసకులను ఇద్దరిని మెప్పించి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారారు వైష్ణవి.. దీనితో వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి ఈ ముద్దగుమ్మకి.. అనే వార్తలు వినిపిస్తున్నాయి..
పూరి జగన్నాథ్ మరియు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో వైష్ణవి కనిపించనున్నది అనే వార్త చక్కర్లు కొడుతుంది.. కానీ దీని పైన ఎలాంటి స్పష్టత లేదు.. ఇది ఇలా ఉండగానే మరో ప్రచారం జరుగుతుంది.. అదే బొమ్మరిల్లు భాస్కర్ చిత్రంలో వైష్ణవికి అవకాశం వచ్చింది అనే వార్త ప్రభంజనం సృష్టిస్తుంది..
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఒక సినిమా ఈ మధ్యనే లాంచ్ అయింది. ఈ చిత్రంలో సిద్దు జొన్నల గడ్డతో తెరమీద సందడి చేయనుంది వైష్ణవి అనే గుసగుసలు విన్పిస్తున్నాయి అని సినీ వర్గాల సమాచారం.. ప్రేమ కథ చిత్రాలకు బొమ్మరిల్లు భాస్కర్ పెట్టింది పేరు.. ఇక ఆయన సినిమాలో వైష్ణవికి అవకాశం వచ్చింది అంటే వైష్ణవి చైతన్య పంట పండిందనే చెప్పాలి అంటూ నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు..