NTR Nagarjuna: కింగ్ బాబాయ్ పుట్టినరోజు.. ఎన్టీఆర్ ఫాన్స్ రచ్చరచ్చ

0
27

అక్కినేని నటవారసుడు.. మగువల మనసు దోచుకున్న మన్మధుడు.. అభిమానుల ఆరాధ్య దైవం కింగ్ నాగార్జున పుట్టిన రోజు ఈ రోజు.. ఈ సందర్భంగా మన్మధుడు సినిమా రీ రిలీజ్ కాగా మరోవైపు ‘నాగ్ 99’ చిత్రం ప్రోమో వచ్చేసింది.. ఈ నేపథ్యంలో అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నారు.. అభిమానుల హడావిడి అంబరాన్ని తాకుతుంది.. కింగ్ అభిమానులంటే అలా ఉంటది మరి అనేలా సంబరాలు జరుపుకుంటున్నారు అక్కినేని అభిమానులు.. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ అభిమానులు కూడా అక్కినేని అభిమానులతో కలిసి హ్యాపీ బర్త్డే బాబాయ్ అంటూ కామెంట్స్ రూపంలో వాళ్ళ విషెస్ ని తెలుపుతున్నారు..

ఎన్టీఆర్ సొంత బాబాయ్ ల చూస్తారు నాగార్జున ని.. అలానే బాబాయ్ అనే పిలుస్తారు.. నాగార్జున కూడా ఎన్టీఆర్ ని పెద్దకొడుకుగానే భావిస్తారు.. అక్కినేని అఖిల్ కి ఎన్టీఆర్ ని చూపించి మా పెద్దబ్బాయి తారక్ ని చూసి మాస్ నేర్చుకోరా అని నాగార్జున స్టేజ్ పైనే చెప్పాడు అంటే ఈ ఇద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయం బహిరంగంగా చాలాసార్లు తెలిపారు ఇద్దరు కూడా..

అక్కినేని నందమూరి కుటుంబాల మధ్య ANR ఎన్టీఆర్ కాలం నుండే మంచి సన్నిహితం ఉంది.. అలానే నాగార్జున, హరికృష్ణ కలిసి సీతారామరాజు అనే సినిమాలో నటించారు.. అప్పటినుండి వారి మధ్య అనుభందం మరింత బలపడింది.. దీనితో నాగార్జున హరికృష్ణ ని అన్న అనే పిలిచేవాడు.. అన్నలానే అభిమానించేవారు.. కాగా నాగార్జున ఎన్టీఆర్ కూడా అంతే అభిమానము తో మెలగడం ఆనందదాయకం అభిమానులకి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here