ఆవగింజంత అదృష్టం ఉంటె చాలు.. మృత్యువు కోరల్లో చిక్కుకున్న బ్రతికి బయట పడొచ్చు..కొన్ని కొన్ని సార్లు అంతా సవ్యంగా ఉంది అనుకుని ప్రశాంతగా ఉన్న సమయంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుని అలజడిని కలిగిస్తాయి..అటువంటి ఒక ఘటనే అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగింది. ఒక హైవే పై అప్పటి వరకు మంచిగా వెళ్తున్న బస్సులో సడెగా మంటలు వ్యాపించాయి. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసి నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు.డ్రైవర్ అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది.
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ నగరంలో హైవే పై చాలా రద్దీగ ఉంది.. ఆ రద్దీ హైవే పై ఒక పెద్ద డబుల్ డక్కర్ బస్సు వెళుతుంది. ఉన్నటుండి ఒక్కసారిగా ఆ బస్సు వెనక భాగంలో మంటలు చెలరేగినట్లు వీడియొలో స్పష్టంగా తెలుస్తుంది..ఇది గమనించి ప్రయాణికులు భయాందోళనకు గురికాగా డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు ఆపేశాడు. తదనంతరం అందులో ఉన్నవారందరూ భయంతో హుటాహుటీగా బస్సు దిగి పరుగులు తీశారు.. తరువాత బస్సు పూర్తిగా కాలిపోయింది..మంటలు చెలరేగి చుట్టుపక్కల వ్యాపించాయి. ఈ మంటల కారణంగా ఆ ప్రాంతం అంత పొగమయం అయింది… అయితే అదృష్టవశాత్తు బస్సు లోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు..
అంతేకాకుండా ఘటన జరగుతున్న సమయంలో బస్సు పక్క నుంచి వెళుతున్న కార్లు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా తప్పించుకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోని మంటలను ఆర్పేశారు… అయితే ఈ ఘటన మొత్తం హైవేపై ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను అర్జెంటీనా పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఇది చూసిన వారందరూ ఆ బస్సులో ఉన్న వారందరూ ఎంతో అదృష్టవంతులు అందుకే వారికి ఏం కాలేదని దేవుడుకు థ్యాంక్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక డ్రైవర్ చాకచక్యాన్ని వీడియొ వీక్షించిన ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అతను సమయానికి బస్సు ఆపి ప్రాణనష్టం జరగకుండా ఆపారని కొనియాడుతున్నారు.