జనసంద్రంగా మారిన బందర్.. జనసేన సభకు సర్వం సిద్ధం

0
39

నోవాటెల్ నుంచి ఆటో నగర్ బయల్దేరారు జనసేన అధినేత పవన్.. దీంతో బెజవాడ బందరు రోడ్డులో స్తంభించింది ట్రాఫిక్.. ఆటో నగర్ వచ్చి వారాహి వాహనంపై మచిలీ పట్నం వెళ్లనున్నారు పవన్. మచిలీపట్నం బహిరంగసభ ప్రాంతానికి చేరుకుంటున్న జనసైనికులతో అక్కడ కోలాహలం ఏర్పడింది. సాయంత్రం 5 గంటలకు సభావేదిక వద్దకు చేరుకుంటారు పవన్ కల్యాణ్..విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై భారీగా ఫ్లేక్సీలు ఏర్పాటు..దూరప్రాంతాల నుండి వచ్చే జనసైనికుల కోసం భోజన సదుపాయం ఏర్పాటుచేశారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు.

ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సభ ప్రాంగణం వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటయింది. భారీగా పోలీసు బలగాలు మోహరించారు.. పోలీసు బందోబస్తును పరిశీలించిన జిల్లా ఎస్పి జాషూవా..పలు సూచనలు చేశారు. ఆంక్షల గురించి వివరించారు. విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి సూచనలు చేసిన ఎస్పి.. 400 మంది పోలీసు సిబ్బంది తో బందోబస్తు. సిసి కెమెరాల పర్యవేక్షణలో పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు. పోలీసు ప్రత్యేక సిసి కెమెరా వాహనం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. బైక్ ర్యాలీలు లాంటి వద్దని పోలీసులు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here