ఖలిస్తానీ నేతకు మహిళలతో సంబంధాలు.. ఐఎస్ఐ సహకారం..

0
85

ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పంజాబ్ లో విధ్వంసానికి పాల్పడేందుకు ప్లాన్ వేస్తున్నట్లు తేలింది. ఇప్పటికే ఇతడికి పాక్ ఐఎస్ఐ మద్దతు ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ నుంచి ఆయుధాలు సేకరించే పనిలో ఉన్నాడని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. పాక్ ఐఎస్ఐ నుంచి సేకరించిన ఆయుధాలను డీఅడిక్షన్ సెంటర్స్, జల్ పూర్ఖేడా వద్ద కొన్ని గురుద్వారాల్లో భద్రపరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన అనుచరులతో తుపాకులను బహిరంగంగా ప్రదర్శించాడు.

ఇదిలా ఉంటే ఖలిస్తాన్ గురించి మాట్లాడి తనను తాను ప్రభోదకుడిగా భావించే అమృత్ పాల్ సింగ్ పలువరు మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగించినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఛాటింగ్, వాయిస్ నోట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే 12 వాయిస్ నోట్లు ఓ మీడియా సంస్థ చేతికి వచ్చాయి. వాటితో టైంపాస్ కోసం మహిళతో సంబంధాలు పెట్టుకుంటున్నట్లు ఆయన చెప్పిన మాటలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో కొందరు వివాహిత మహిళలు ఉన్నట్లు గుర్తించారు. అతడి ఇన్ స్టా గ్రామ్ చాటింగ్ లో ఓ మహిళను వివాహేతర సంబంధం గురించి అడుగుతున్నట్లు ఉంది.

ఇదిలా ఉంటే ఆయన కోసం ఏడు రోజులుగా వేట కొనసాగిస్తున్నారు పంజాబ్ పోలీసులు. చివరిసారిగా హర్యానాలో ఓ మహిళ ఆశ్రయం ఇచ్చినట్లు గుర్తించారు. బల్జీత్ కౌర్ తన ఇంట్లో అమృత్ పాల్ సింగ్, పప్పల్ ప్రీత్ సింగ్ లకు ఆశ్రయం ఇచ్చినట్లు హర్యానా పోలీసులు కనుగొన్నారు. ఆదివారం షాహాబాద్ లోని తన ఇంట్లో మహిళ ఆశ్రయం ఇచ్చింది. హర్యానాలో చివరిసారిగా సీసీ కెమెరా ఫులేజీల్లో అమృత్ పాల్ సింగ్ కనిపించాడు. తలపాగా తీసేసి లుక్స్ ఛేంజ్ చేసుకున్నట్లు మహిళ వెల్లడించింది. ఓ గొడుగు అడ్డం పెట్టుకుని బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వెసుకుని వెళ్తున్న అమృత్ పాల్ సింగ్ ను పోలీసులు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here