సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్

0
1640

సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఇదే మీకు ఆఖరి అవకాశం. బడ్జెట్ లో ఇచ్చిన హామీలన్నింటికీ నిధులు కేటాయించండి. అసెంబ్లీ వేదికగా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి అని ఆయన ప్రశ్నించారు. అతిపెద్ద నాగోబా జాతరను విస్మరించిన కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. గిరిజనులంటేనే కేసీఆర్ కు చులకన.. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు కుట్ర చేశారు. పోడుభూములకు పట్టాలిస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారు.

ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేశారన్నారు. తండాలకు నిధులివ్వకుండా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నాడన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేశం గర్వపడేలా నాగోబా జాతరను ఘనంగా నిర్వహిస్తాం అన్నారు. అర్హులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తాం అని ఆయన హామీ ఇచ్చారు. నిలువనీడలేని వాళ్లందరికీ ఇండ్లు నిర్మిస్తాం… రైతులకు పంట నష్టపరిహారం అందిస్తాం అన్నారు ఎంపీ బండి సంజయ్ కుమార్.

కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండాతో కలిసి ఈరోజు ఉదయం నాగోబా జాతరకు విచ్చేసిన బండి సంజయ్ నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ వందనంతో అర్జున్ ముండా, బండి సంజయ్ లకు అధికారులు ఘన స్వాగతం పలికారు. మెస్రం వంశం పక్షాన బండి సంజయ్ కు, అర్జున్ ముండాకు ఆదివాసీలు స్వాగతం పలికారు. బండి సంజయ్ రాకతో నాగోబా జాతరకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం కేస్లాపూర్ నాగోబా జాతర ‘‘దర్బార్’’ కు హాజరై ఆదివాసీలను ఉద్దేశించి ప్రసంగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here