ఆ మంత్రులకు డ్రగ్స్ ట్రస్ట్ చేయిస్తాం.. బండి సంజయ్

0
687

మునుగోడులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ పై మండిపడ్డారు. టీఆర్ఎస్ కి చెందిన 16 మంది మంత్రులకు డ్రగ్స్ టెస్ట్ చేయించాలన్నారు. కేటీఆర్ పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువు అంటే అర్థం తెలుసా. నువ్వు నీ అయ్యను కొడతావు.. డ్రగ్స్ తీసుకొని నువ్వు, మందు తాగి నీ అయ్య సోయి లేకుండా ఏమి చేస్తున్నారో మీకు తెలియదు…చెప్పులు గురువులకు అందిస్తాం… గురు శిష్యుల బంధం అది అన్నారు.

గుడిని ఎందుకు సంప్రోక్షణ చేయాలన్నారు. మీది మీ అయ్యది నోరు యాసిడ్ తో సంప్రోక్షణ చేయాలని ఎద్దేవా చేశారు. ఆ గుడి చాలా పవర్ ఫుల్… తప్పు చేసిన వాడు ఎవ్వడు ఆ గుడికి తడి బట్టలతో వెళ్ళడన్నారు బండి సంజయ్. నీవు నాస్తికుడివు కదా… దేవుణ్ణి నమ్మవు కదా.. మిమ్మల్ని గద్దె దించి తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తాం…అయ్యా కొడుకులు నోరు హద్దుల్లో పెట్టుకోవాలి…నీ ఎమ్మేల్యేలు తప్పు చేయక పోతే ప్రగతి భవన్ లో ఎందుకు పెట్టుకున్నావన్నారు బండి సంజయ్. 16 మంది మంత్రులు ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుంటారు… అధికారంలోకి రాగానే వారికి టెస్ట్ లు చేస్తాం… కెసిఆర్ కుటుంబ సభ్యులతో సహా అన్నారు. కృష్ణ జలాల విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం చేసిందే కెసిఆర్. ఏపీ సీఎంతో లాలూచీ పడి మనకు రావాల్సిన నికరజలాలను వదులుకున్నారన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దొంగ ఓటు వేశారని ఆరోపణలున్నాయి.. దేవుడి ముందు వారు ప్రమాణం చేయాలి.. కర్నాటకలో రోహిత్ రెడ్డి మీద డ్రగ్స్ కేసు ఉందన్నారు బీజేపీ ఇన్ ఛార్జి తరుణ్ చుగ్. మునుగోడులోని చండూరు రోడ్డులో మునుగోడు నియోజకవర్గ దళిత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరయ్యారు తరుణ్ చుగ్, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, బండి సంజయ్ ,వివేక్ వెంకట స్వామి, గంగిడి మనోహర్ రెడ్డి,బోడిగే శోభ, బాబూమోహన్, మాజీ మంత్రి చంద్రశేఖర్, విజయ రామారావు, కర్ణాటక కోలార్ ఎంపీ మునుస్వామి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here