అంతర్జాతీయ స్థాయిలో బెంగళూర్.. ఎమర్జింగ్ సిటీస్ జాబితాలో చోటు

0
129

భారత సిలికాన్ వ్యాలీ, సాప్ట్ వేర్, ఐటీ, అంతరిక్ష పరిశోధన సంస్థలకు కేరాఫ్ గా ఉన్న బెంగళూర్ మరో ఘనత సాధించింది. తాజాగా బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ స్థాయి నగరాల్లో బెంగళూర్ కూడా ఉంది. బ్లామ్ బెర్గ్ ప్రకారం ప్రవాసుల కోసం అభివృద్ధి చెందుతున్న వరల్డ్ ఎమర్జెంగ్ సిటీల జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా ఆరు నగరాలు చోటు దక్కించుకోగా.. అందులో బెంగళూర్ కూడా ఉండటం విశేషం.

బ్లూమ్ బెర్గ్ ప్రకారం ప్రవాసులను ఆకర్షించడంలో బెంగళూర్ నగరం ముందుంది. ఒక అంచనా ప్రకారం మూలధన ప్రవాహం ( వెంచర్ క్యాపిటల్) లండన్, శాన్ ఫ్రాన్సిస్కోల కన్నా బెంగళూర్ లోకే ఎక్కువగా వస్తున్నాయని వెల్లడించింది. 2016లో 1.3 బిలియన్ డాలర్లు ఉన్న మూలధన నిధులు 2020 నాటికి 7.2 బిలియన్లకు చేరిందని వెల్లడించింది. పెరుగుతున్న ప్రవాసులకు అనుగుణంగా ఇంటర్నేషనల్ స్కూల్స్, బార్స్ అండ్ రెస్టారెంట్లు వెలుస్తున్నాయని తెలిపింది.

బెంగళూర్ సాఫ్ట్ వేర్ కేంద్రంగా ఉండటమే కాకుండా.. వందలాది స్టార్టప్స్ కు నిలయంగా మారింది. ఇది విదేశీయులను సైతం ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించడం వల్ల బెంగళూర్ ప్రపంచ స్థాయి నగరంగా మారే అవకాశం ఉందన్ని బ్లూమ్ బెర్గ్ అంచనా వేసింది. బెంగళూర్ తో పాటు వరల్డ్ ఎమర్జింగ్ సిటీల జాబితాలో కౌలాలంపూర్, లిస్బన్, మెక్సికో సిటీ, దుబాయ్, రియో డిజెనీరో వంటి నగరాలు ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూర్ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. 500 కన్నా ఎక్కువ ఐటీ, బీపీఓ సంస్థలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here