త్వరలో బీజేపీ అధిష్ఠానం అత్యంత కీలక నిర్ణయం: సోము వీర్రాజు

0
125

ఏపీ రాజకీయాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో కీలక పరిణామాలు జరగబోతున్నాయన్నారు. ఎవ్వరూ ఊహించని పరిణామాలు ఏపీలో చోటు చేసుకోబోతున్నాయని ఆయన వెల్లడించారు. ఏపీ విషయంలో బీజేపీ అధినాయకత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకోబోతోందన్నారు. రాజకీయ పరిణామాలు ఈ విధంగా ఎలా జరిగాయోననే విషయం ఎవ్వరికీ అర్ధం కాదన్నారు. ఏపీలో త్వరలో సినిమా సీన్లను మించిన స్థాయిలో పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు.

ఎవ్వరికీ భయపడని జగన్ భయపడేది నరేంద్ర మోడీకేనని ఆయన అన్నారు. వైసీపీని గద్జె దించే ఏకైక పార్టీ బీజేపీనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతర్వేదిలో రథం దగ్ధమైతే బీజేపీ ఒత్తిడితో ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. జగన్ ప్రభుత్వాన్ని వణికించిన పార్టీ బీజేపీ అంటూ చెప్పుకొచ్చారు. విగ్రహాలు, రథాలను ధ్వంసం చేస్తే బీజేపీ పోరాటం చేసిందన్నారు. రామ తీర్థం నుంచి కపిల తీర్థం వరకు యాత్ర చేస్తామంటే వెనక్కి తగ్గారన్నారు. రాయలసీమ కూడా యాత్ర చేసి ప్రాజెక్టుల పనులు చేపడతామన్నారు. పోలవరంలో నిర్వాసితులే కాదు.. ఏపీ వ్యాప్తంగా నిర్వాసితులు ఉన్నారని వీర్రాజు వెల్లడించారు. స

నలభై ఏళ్ల నుంచి ఉన్నా.. పోలవరం గురించే నేడు మాట్లాడతారని.. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది ‌మోడీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పేదలకు ఉచిత బియ్యం ఇవ్వకుండా జగన్ ఆపేశారని ఆయన ఆరోపించారు. బీజేపీ రంగంలోకి దిగగానే రెండో కోటా ఇచ్చారని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here