Boa Capsize: బ్రతుకు వేటలో వలస బాట.. దేవుడు ఆడిన ఆటలో 60 మంది మృత్యువాత

0
31

మనిషి ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడంట అనే సామెతని తరుచు వింటుంటాం.. ప్రతి మాట మన పూర్వికులు అనుభవ పూర్వకంగా చెప్పారని ఇలాంటి సంఘటనలు చూసినప్పుడే అనిపిస్తుంది.. పుట్టి పెరిగిన ఊరిలో పూటగడవక పక్క ప్రాంతాలకు బ్రతుకు దెరువుకోసం వలస వెళ్లాలనుకున్నారు… అనుకున్నట్టుగానే వారు వెళ్ళాలి అనుకున్న ప్రాంతానికి పడవలో బయలుదేరారు… కానీ ఎవరు ఊహించని సంఘటన ఆ వలసదారులని అర్ధాయుష్షులని చేసి అనంత లోకాలకి పంపింది.. ఈ హృదయ విదారక సంఘటనలో 60 మంది మృతి చెందారు..

ఈ సంఘటన పశ్చిమాఫ్రికాలోని కేప్ వెర్డేలో చోటు చేసుకుంది.. కేప్ వెర్డే ద్వీపం యూనియన్‌లోని స్పానిష్ కానరీ దీవుల సమూహం.. ఇది తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. సబ్-సహారా ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రజలతో ఈ పడవ సెనెగల్‌లోని ఫాస్సే బోయ్ నుండి జూలై 10న 101 మంది ప్రయాణికులతో బయలుదేరిందని సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది..

ప్రమాదవశాత్తు ఆగష్టు 7న ట్యునీషియా తీరంలో పడవ బోల్తా పపడింది.. ఈ ప్రమాదంలో మొదట దాదాపుగా 11 మంది వలసదారులు మరణించగా .. 44 మంది గల్లంతయ్యారు. ఈ పడవలో ఉన్న 57 మందిలో ఇద్దరు రక్షించబడ్డారు. ఈ ప్రజలందరూ సబ్-సహారా ఆఫ్రికా దేశాలకు చెందినవారు. తప్పిపోయిన వలసదారుల కోసం వెతుకుతున్నట్లు అధికారి పేర్కొన్నారు.
ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని, 56 మంది గల్లంతయ్యారని ఐఓఎం అధికార ప్రతినిధి మసేహాలి తెలిపారు. సాధారణంగా పడవ ప్రమాదం జరిగిన తర్వాత వ్యక్తులు తప్పిపోయినప్పుడు వారు చనిపోయినట్లు భావించబడుతుందని ఆయన అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here