కర్నూలు జిల్లా కల్లూరులో తల్లీకూతురు దారుణ హత్య

0
30

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. కల్లూరు చింతల ముని నగర్ గనిగుంతల ప్రాంతంలో నవ వధువు రుక్మిణి, తల్లి రామదేవిని దారునంగా నరికి హత్య చేశారు. తండ్రి వెంకటేశ్వర్లుని కూడా కత్తులతో పొడిచారు. తీవ్ర గాయాలతో వెంకటేశ్వర్లుని ఆసుపత్రికి తరలించారు. మృతులు వనపర్తికి చెందిన వారు.

కర్నూలుకు చెందిన ప్రసాద్, కృష్ణవేణి కుమారుడు శ్రావణ్ కు వనపర్తికి చెందిన రమాదేవి, వెంకటేశ్వర్లు కూతురు రుక్మిణితో ఈనెల 1వ తేదీ వనపర్తి లో వివాహమైంది. పెళ్లి తంతు పూర్తయి రుక్మిణి ఇవాళే కాపురానికి అత్తింటి వారికి వచ్చింది. రుక్మిణిని అత్తింటిలో వదిలెందుకు తల్లి రమాదేవి, తండ్రి ప్రసాద్ కూడా కర్నూలుకు వచ్చారు. శ్రావణ్ హైద్రాబాద్ లో బ్యాంకులో ఉద్యోగి. రుక్మిణిని, తల్లి రామదేవిని శ్రావణ్ , తండ్రి ప్రసాద్ దారుణాంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. వెంకటేశ్వర్లును కూడా కత్తులతో పొడుస్తుండగా స్థానికులు అడ్డుకోవడంతో తీవ్ర గాయాలతో బయటపడ్డారు.

రుక్మిణి కాళ్ళ పారాణి ఆరకుండానే, ఇంటికి మామిడాకులు కూడా తీయకుండానే ప్రాణాలు కోల్పోయింది. తన కొడుకును పనికిరాకుండా చేశాడని అరుస్తూ తండ్రి కత్తులతో పొడిచి హత్య చేశాడు. హత్య ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపైనా నిందితులు కేకలు వేశారు. హత్యకు స్పష్టమైన కారణం తెలియరాలేదు. ఇడ్లి అమ్ముతూ జీవనం గడుపుతున్న ప్రసాద్ కుటుంబం గతంలో ఎలాంటి గొడవలు లేవని స్థానికులు చెబుతున్నారు. రెండు కుటుంబాల మధ్య ఏదో జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here