దూడకు గుండు కొట్టించాడు.. ఎందుకో తెలిస్తే షాక్!

0
273

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. బఘోలీ పీఎస్ పరిధిలోని సున్ని గ్రామానికి చెందిన ప్రమోద్ శ్రీవాస్తవ అనే రైతు తాను పెంచుకుంటున్న దూడకు నవరాత్రుల మొదటి రోజున దుర్గా ఆలయంలో గుండు కొట్టించాడు. అంగరంగ వైభవంగా దుర్గా ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకుని ఓ దూడకు గుండు చేయించుకున్నాడు. వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న గ్రామస్తులకు విందు కూడా ఏర్పాటు చేశాడు.

అతను ఇలా చేయడానికి కారణం అతని ఇంట్లోని దూడలు చనిపోతున్నాయని.. తన ఆవు పిల్లలన్నీ కడుపులోనే చనిపోతుండటంతో ఆ దూడ పుట్టాలని కోరుకున్నట్లు వెల్లడించారు. కోరిక తీరడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి దూడకు గుండు కొట్టించాడు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులతో పాటు బంధుమిత్రులను కూడా ఆహ్వానించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం ఇప్పుడు పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here