వైరాలో భారీ వర్షం.. డ్రైనేజీల్లో వింత చేపలు

0
116

ఈమధ్యకాలంలో చేపలు వర్షం రూపంలో పడుతున్నాయి. తెలంగాణలోని కాళేశ్వరంలో ఇటీవల చేపలు వాన పడింది. ఇంటిముంందు చిన్న చిన్న కుంటల్లో చేపలు కనిపించాయి. తాజాగా ఖమ్మం జిల్లాలోని వైరా మున్సిపాలిటీ పరిధిలో చేపల వర్షం కురిసింది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి వింత చేపలు డ్రైనేజీలలో కనిపిస్తున్నాయి. వర్షానికి వింత చేపలు ఇళ్లల్లో కాలువల్లో డ్రైనేజీల్లో కనిపిస్తున్నాయి. రాత్రి వైరా మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లడంతో మున్సిపాలిటీ పరిధిలో కొన్ని వార్డుల్లోని నీరంతా బయటకు వెళ్లిన తర్వాత డ్రైనేజీ ఇంటి పక్కన స్థలాల మధ్యన ఉదయం చేపలు ఎగురుతూ కనిపించాయి. వాటిని ప్రజలు వింతగా చూస్తున్నారు.

నిజానికి చేపల వాన పడాలంటే ఆకాశంలో అద్భుతాలేం జరగవు. అవి ఆకాశం నుంచే వచ్చినా ఆకాశంలో ఏమీ చేపలుండవు. నిజానికి అవి భూమి మీదనుంచే ఆకాశానికి వెళతాయి. ఎలాగంటే నదులు సముద్రాలు దగ్గర నీరు ఆవిరై, అది మేఘమై తిరిగి భూమిపైనే మేఘాలు ఆ నీటిని వర్షిస్తాయి. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో సముద్రంలో కొన్ని రకాల కదలికలు జరుగుతాయి. మెరుపులు, ప్రచండమైన గాలుల కారణంగా సముద్రంలో ఉండే చేపలగుడ్లు, చిన్న చిన్న కప్పల గుడ్లు ఆవిరి ద్వారా మేఘాలలోకి చేరుకుంటాయి. అలా చేరుకుని, అవి తిరిగి వర్షం ద్వారా భూమిని చేరుతాయని కనుగొన్నారు.ఇది ఎంత వరకూ నిజమనేదానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. కుండపోతగా కురిసిన వర్షంతో పాటు చేపలు వివిధ ప్రాంతాల్లో పడినట్టు మనం వార్తలు చదివాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here