పోలీస్ శాఖలో హోంగార్డ్ ఉద్యోగాల పేరుతో మోసం

0
581

పోలీస్ శాఖలో హోం గార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు బాధితుల దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేశారు పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు.. చివరకు సంవత్సరాలు గడుస్తున్న ఉద్యోగాలు రాకపోవటంతో పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులను ఆశ్రయించారు బాధితులు ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా… లెట్ వాచ్ దిస్ స్టోరీ…….

విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సుబ్బారెడ్డి హోమ్ గార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటు పలువురు నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బు వాసులు చేశాడు.. నగరంలోని రాణిగారి తోటకు చెందిన శరత్ చంద్ర తో కానిస్టేబుల్ సుబ్బారెడ్డి పోలీసు శాఖలో హోం గార్డ్ ఉద్యోగాలు ఉన్నాయంటూ నమ్మబలికి శరత్ చంద్రతో పాటు మరికొంత మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు… ఇదంతా గత రెండు సంవత్సరాల క్రితం జరగాగ, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పలు దఫాలుగా బాధితులు డబ్బులు కానిస్టేబుల్ సుబ్బారెడ్డి అందచేశారు.. సంవత్సరాలు గడుస్తున్న ఉద్యోగాలు రాకపోవటంతో సుబ్బారెడ్డినీ గట్టిగా నిలదీశారు బాధితులు.

కొన్ని రోజుల తర్వాత ఒక ఫేక్ లెటర్ తో అపాయింట్ మెంట్ లెటర్ ను బాధితులను అందచేశారు.. కొన్ని రోజుల్లో మీకు పోస్టింగ్ వస్తుంది అంటూ నమ్మబలికాడు సుబ్బారెడ్డి… ఆ తర్వాత అది ఫేక్ లెటర్ అని తెలుసుకున్న బాధితులు తిరిగి సుబ్బారెడ్డినీ ఇదే విషయంపై ప్రశ్నించగా పోలీస్ డిపార్ట్ మెంట్ లో అపాయింట్ మెంట్ లెటర్ లు ఇలానే వుంటాయని, ఒక ఇరవై రోజుల్లో మీ జాయినింగ్ లెటర్ పోస్టు ద్వారా, మెయిల్ ఐడీ ద్వారా వస్తుందని నమ్మబలికాడు కానిస్టేబుల్ సుబ్బారెడ్డి..చివరకు ఎటువంటి లెటర్స్ లేకపోవటంతో బోదిబో అంటు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు.ఈ హోం గార్డ్ ఉద్యోగాల విషయంలో కానిస్టేబుల్ సుబ్బారెడ్డికి సహకరించడు అదే స్టేషను లో పనిచేస్తున్న సురేష్ అనే కానిస్టేబుల్…..

బాధితుల్లో కొంత మంది తిరిగి డబ్బులు ఇవ్వన్నీ కానిస్టేబుళ్లను ప్రశ్నించగా మీపై గంజాయి కేసులు పెడతామంటు బెదిరింపులకు పాల్పడ్డారు. చేసేదేమీ లేక కొంతమంది బాధితులు కనీసం పోలీస్ కంప్లెయింట్ ఇచ్చేందుకే ముందుకు రాలేదు.. మొత్తం బాధితుల్లో ఇద్దరు మాత్రమే ఈ విజయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు.ఈ విషయన్ని నగర సిపి కాంతి రాణా టాటా తోపాటు డిసిపి విశాల్ గున్నికి తెలియచేసారు బాధితులు. ఈ ఘటనపై ప్రస్తుతం వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేసే పనిలో పడ్డారు.

పోలీస్ శాఖలో నిజాయితీగా పనిచేయాల్సిన ఉద్యోగులు ఈవిధంగా చేయటం పట్ల ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బాధితుల్లో కొంత మంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చేందుకే భయపడుతున్నారు అంటే బాధితులను ఎంతెలా బయపెట్టరో చెప్పనక్కర్లేదు..ఉద్యోగం వస్తుందని అధిక వడ్డిలతో డబ్బు అప్పుకు తెచ్చామని బాధితులు వాపోతున్నారు.. దీంతో అప్పు ఇచ్చినవారు డబ్బులు చెల్లించాలని వత్తిడీ చేస్తున్నారని అధికారులు మాకు న్యాయం చేయాలంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.. ఇద్దరు పోలీసు శాఖలోనే ఉద్యోగం కావటంతో కానిస్టేబుళ్లు ఇద్దరిపై ఉన్నతాధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here