ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలి?

0
74

శుభకృత్ సంవత్సరం వెళ్లిపోతోంది. మరకొద్ది గంటల్లో శోభకృత్ వచ్చేస్తోంది. ఈ ఉగాది ఎలా ఉండబోతోంది. ఉగాది నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలి?తెలుగు వారి ఉగాది అంటే తెలుగు సంవత్సరాది తొలిరోజు అని అర్థం. పశ్చాత్య దేశాల్లో జనవరి 1 కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలుగు రాష్ట్రాల్లో ఉగాదికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఉగాదిని వేడుకల్లా నిర్వహించుకుంటారు. ఉగాది రోజు ఇష్టదైవాన్ని పూజించుకుని ప్రసాదంగా ఉగాది పచ్చడిని తింటారు.

ఉగాది పచ్చడి తయారీ కాలన్ని బట్టి మారుతూ ఒక్కొక్కరూ ఒక్కో రకంగా తయారుచేస్తారు. ఉగాది పచ్చడిలో ఆరురుచులు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే..ఉగాదికి ఖచ్చితంగా తయారుచేయాల్సిన ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి. అవే.. తీపి, కారం, పులుపు, ఉప్పు, వగరు, చేదు. తీపికి బెల్లాన్ని, కారానికి పచ్చిమిర్చిని, మరికొంతమంది కారం వాడుకుంటారు, పులుపుకి చింతపండు లేదా నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు, ఉప్పు, వగరుకి మామిడి కాయని, చేదు వేపుపువ్వుని వాడడం వస్తున్న ఆనవాయితీ.. మన జీవితంలోని కష్టసుఖాలకు, జరగబోయే మంచి చెడులను ఈ రుచులు సూచిస్తాయని అంటారు. ఇక ఉగాది పచ్చడి తిన్నప్పుడు తీపి తగిలితే ఆ ఏడాదంతా సాఫీగా.. ఆనందంగా సాగుతుందని భావిస్తారు ప్రజలు. అలాగే చేదు తగిలితే కష్టాలు తప్పవని, పులుపు కష్టం సుఖం కలిసే వస్తాయని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఉగాది పచ్చడి తయారీ పూర్వాకాలం నుంచి వస్తున్న పద్దతి ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here