పేదలకు భూముల కేటాయింపుల విషయంలో తమ ప్రభుత్వానికి ఒకపాలసీ ఉందన్నారు మంత్రి ధర్మానప్రసాదరావు. రాజధానిలో భూమి కేవలం రియల్ ఎస్టెట్ చేస్తారా , పేదలకు ఇల్లు ఇవ్వకూడదా అని ప్రశ్నించారు ధర్మాన. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ చేయటం కారణంగానే ప్రజలందరికీ కొపం వచ్చిందన్నారాయన.
ఇళ్ళ స్దలం లేనికుటుంబం ఉండకూడదని భావిస్తూ , పన్నెండు వేల కోట్ల రూపాయలు డబ్బు పెట్టి భూమి కొని ప్రజలకు ఇచ్చామని తెలిపారు. రాజదాని కేవలం పెద్దల కోసం కాదు , బీదవారు అస్పృశ్యులు కాదన్నారాయన. గతంలో ఒక్క ఎకరా భూమి కూడా చంద్రబాబు బీదల కొసం కొన్నది లేదని అన్నారు. ప్రజల తరుపున ఎవరు నిలబడ్డారు , రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడ్డారన్నది ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ప్రజలే చేస్తారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.