డిసెంబర్ 31న మందుతో చిందెయ్యండి ఇక..

0
1490

Good news for Liquor Lover: మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మందు తాగేవారు ఏమంటారంటే, చుక్క మందు, చికెన్ ముక్కతో చల్లబడి ఎంజాయ్ చేద్దాం అనే రీతిలో ఎంజాయ్‌ చేసేందుకు సిద్దమవుతున్నారు. డిసెంబర్ 31న మద్యం షాపుల ముందు క్యూలు కట్టనున్నారు. అయితే ఆరోజు ముందుగానే మూతపడడంతో ఆందోళన చెందుతున్నారు. 31 రాత్రి వరకు చుక్కకు అనుమతించకపోతే ఎలా అంటూ పీలవతున్న మందుబాబులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది.\

బార్లు, పబ్బులు, మద్యం షాపుల తెరిచి ఉండే సమయాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం దుకాణాలు, వైన్ షాపులు తెరిచి ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్సు గల బార్‌లు అర్ధరాత్రి 1 గంటల వరకు మద్యం విక్రయాలు కొనసాగుతాయని వెల్లడించారు. కరోనా కష్టకాలంలో మద్యం అమ్మకాలు ఆగిపోయినందున, లైసెన్స్‌లు పొందిన షాపు యజమానులు, బార్ నిర్వాహకులకు మినహాయింపుగా ఈ మద్యాన్ని విక్రయించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో మందుబాబులు ఇక పండగ చేసుకుంటూ ఆనందంతో చిందులు వేస్తున్నారు. కొత్త సంవత్సరానికి తెలంగాణ సర్కార్‌ న్యూయర్‌ కానుకగా అందించడంతో మందుబాబులు ఆనందాలు అంబరాన్నంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here