పాడేరు ఏజెన్సీలో చిన్నారుల మరణ మృదంగం

0
870

గిరిపుత్రుల పిల్లలు మిస్టరీగా మరణిస్తున్నారు. పాడేరు ఏజెన్సీలో పిల్లల కేరింతల కంటే చావు కేకలు భయపెడుతున్నాయి. సీజనల్ వ్యాధులు, అంతుబట్టని సమస్యలతో చిన్నా రులు మృత్యువాత పడుతున్నా రు. రూఢకోటలో అంతుబట్టని మరణాల మిస్టరీ వీడక ముందే మరికొన్ని గిరిజన గ్రామాల్లోను మరణాలు సంభవిస్తున్నాయి. బిడ్డ పుట్టిందనే ఆనందం కంటే వాళ్లను ఎలా బ్రతికించుకోగలమనే బెంగ తల్లిదండ్రులను వెంటాడుతోంది. ఏవోబీ సరిహద్దు గ్రామం రూఢకోటలో చిన్నారుల మరణాలు
అధ్యయనాలకు అందడం లేదు.

2018నుంచి 2022మధ్య ఈ గ్రామంలోని ఒకే వీధికి చెందిన 22 మంది చనిపోయారు. మిస్టరీ మరణాలపై గత ఏడాది రాష్ట్ర గవర్నర్ స్పందించడంతో ఇక్కడ నీరు,గాలి నమూనాలతో పాటు స్థానిక గిరిజనుల స్థితిగతులు, అపరిశుభ్ర పరిస్థితులను నిపుణుల కమిటీ పరిశీలించింది.

అకస్మాత్తుగా తల్లిపాలు తాగెయ్యడం ఆపేసిన చిన్నారులు…ఒకటి రెండు రోజుల్లోనే మృత్యువు వడికి చేరుతున్నారు. ఇప్పుడు మళ్లీ సీజన్ మారింది. రూఢకోటలో చావు భయం కనిపిస్తోంది. దీంతో  చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఇళ్ళు వదిలి బంధువుల ఊళ్లకు వెళ్ళిపోతున్నారు. ఇక గర్భవతు లైతే సొంత గ్రామం పేరు చెబితేనే వణికిపోతున్న పరిస్థితి.

పిల్లపాపలతో కళకళలాడిన గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రాణాలు తీసేస్తున్నాయ్. రూఢ కోట తరహాలో మరికొన్ని గ్రామాల్లోను మరణాలు నమోదవుతు న్నాయి. గత ఏడాది హుకుంపేట మండలం కోసురులో రోజుల వ్యవధిలో ఐదుగురు మృత్యు వాత పడ్డారు. ఇప్పుడు పాడేరు మండలం గుర్రగురువులో వారం వ్యవధిలో మూడు మరణాలు సంభవించాయి.

300మంది ఉన్న ఈ గ్రామంలో ప్రతీ ఇంట్లోనూ టైఫాయిడ్ , సీజనల్ వ్యాధుల బాధితులు వున్నారు. ఇవన్నీ బాహ్య ప్రపంచానికి తెలిసిన విషాధాలు. జిల్లా కేంద్రం పాడేరు లేదా మండల హెడ్ క్వార్టర్స్, ఆసుపత్రి సౌకర్యాలకు అందుబాటులో ఉన్న గ్రామాల్లో జరుగుతున్న ఘటనలు. ఇక, అడవుల్లోనో…కొండ శిఖరాలకు అనుకునో ఉన్న గిరిజన గూడాల్లో, ఏవోబీలోని ఆదివాసీ గ్రామాల్లో సంభవిస్తున్నవి వెలుగులోకి రానివి  పదుల సంఖ్యలో ఉంటున్నాయని గిరిజన సంఘాలు చెబుతున్నాయి.

అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 4 ఏళ్ల లోపు చిన్నారుల అంతు చిక్కని అనారోగ్య సమస్యతో ప్రాణాలు విడుస్తున్నారు. ఈ ఏడా ది మళ్ళీ పిల్లల మరణాలు నమోదవ్వడంతో జాతీయ గిరిజన సంఘం రూఢ కోటలో పర్యటించింది. గత ఏడాది రూఢకోటలో మరణాలపై ప్రభుత్వం వైద్యుల కమిటీని నియమించి విచారించింది. తల్లిపాలు ఎక్కువగా తాగడం కారణంగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి చనిపోతున్నారనే అభిప్రాయం కలిగించడం సరైనది కాదంటున్నారు గ్రామస్ధులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here