ఆర్టికల్‌ 370 రద్దయి నేటికి మూడేళ్లు.. భారత్ పరువు తీయడమే లక్ష్యంగా..

0
125

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి నేటికి మూడేళ్లు పూర్తవుతోంది. ఈ తరుణంలో భారత్‌ పరువు తీయడమే లక్ష్యంగా పాకిస్థాన్ టూల్‌కిట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. చైనా, బెల్జియం, జపాన్, ఉక్రెయిన్, బెర్మింగ్‌హామ్, దుబాయ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జర్మనీలలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాలు భారత ప్రభుత్వం “కశ్మీర్ ప్రజలపై అణచివేస్తోందని” ఎత్తిచూపటంతో పాటు ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ముసాయిదా సందేశాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాయి. పైన పేర్కొన్న దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ముందు నిరసనలను కూడా పాక్‌ ప్లాన్ చేసింది. ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి యూరోపియన్ దేశాల నుండి పార్లమెంటు సభ్యులను ఆహ్వానించింది.

స్వీడన్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఆగస్టు 5న కశ్మీర్‌పై నిరసనలకు అక్కడి పార్లమెంటు సభ్యులను ఆహ్వానించింది. అంతే కాదు కశ్మీర్‌కు సంబంధించి స్వీడిష్ పత్రికల్లో భారత్‌పై దుష్ప్రచారం చేసే బాధ్యతను కూడా పాకిస్థాన్ దౌత్య కార్యాలయానికి అప్పగించింది. గతేడాది కూడా ఫిబ్రవరి 5న కశ్మీర్‌ సంఘీభావ దినోత్సవం పేరుతో భారత్‌ను అంతర్జాతీయంగా పరువు తీయడానికి పాకిస్థాన్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర చట్టాల పొడిగింపు, అక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ జమ్మూ కశ్మీర్ అంతటా సమసమాజాన్ని స్థాపించింది. అయితే అనేక చట్టాల అమలు వల్ల జమ్మూ కశ్మీర్‌ అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఇటీవల ప్రముఖ వార్థా సంస్థ పీటీఐ వెల్లడించింది. .పాక్ ఆక్రమిత-జమ్మూ కశ్మీర్, ఛంబ్, పశ్చిమ పాకిస్థానీ శరణార్థులతో వంటి సమాజంలోని వర్గాలు కేంద్ర చట్టాల పొడిగింపుతో తగిన ప్రయోజనాలను పొందుతున్నారని తెలిపింది. ఆగష్టు 5, 2019 న, BJP నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను రద్దు చేసింది. పూర్వ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ &కశ్మీర్, లడఖ్. ఈ నిర్ణయాన్ని తర్వాత సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో పిటిషన్‌లను తిరస్కరించింది. మరోవైపు సోషల్ మీడియాలో భారత వ్యతిరేక కంటెంట్‌ను సర్క్యులేట్ చేయడానికి పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోవడానికి దేశంలోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఒక పత్రాన్ని సిద్ధం చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here