ఇస్నాపూర్ లో కలకలం.. నార్కోటిక్ డ్రగ్స్ సీజ్

0
885

హైదరాబాద్ లో ఒకవైపు డ్రగ్స్, గంజాయి పట్టుబడుతోంది. ఇదిలా ఉంటే నార్కొటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పటాన్ చెరు పోలీసులు. ఇస్నాపూర్ లోని ఓ కంపెనీలో నార్కోటిక్ డ్రగ్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్న పటాన్చెరు పోలీసులు. ఆరు లక్షల విలువచేసే నార్కోడ్రగ్స్ , డైజోఫామ్,అలెఫ్రోజోలం సీజ్ చేశారు. డ్రగ్స్ తయారు చేస్తున్న మదన్ మోహన్ రెడ్డి,గురువా రెడ్డి, మనోహర్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసుకి సంబంధించి పరారీలో మరొకరు వున్నారు.

40 డ్రమ్ములలో డ్రగ్స్ తయారు చేసే ముడి పదార్థం. ఒక కారు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పటాన్ చెరు పోలీసులు. డ్రగ్స్ తయారు చేసి గతంలో సిద్దిపేట జిల్లాలో పాటుబడ్డారు నిందితులు. ఇస్నాపూర్ లో పాడుబడ్డ కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గురించి వివరాలు వెల్లడించారు పటన్ చెరు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here