వైసీపీపై పవన్ వరుస ట్వీట్లు.. దేనికీ గర్జన అంటూ సెటైర్లు

0
92

దేనికీ గర్జనలు అంటూ వైసీపీ నేతలపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా?ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా? మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్లిపోతున్నందుకా?విశాఖపట్నంలో ఋషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా? దసపల్లా భూములను మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా? అని పవన్ ప్రశ్నించారు.

ఉదయం నుంచి దేనికి గర్జన పేరుతో పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేస్తూనే వున్నారు. స్కూళ్లు, ప్రభుత్వ భననాలు, ఆలయాల విద్యుత్ దీపాలంకరణ వరకూ పార్టీ రంగులేసుకుంటున్నారు. కోర్టులతో చీవాట్లు తింటున్నారు. ఇసుకను దోచుకుని.. మట్టిని తింటున్నారు. కక్ష రాజకీయాలతో తప్పుడు కేసులు పెడుతున్నారు. సంపూర్ణ మద్య నిషేధం అంటూ మద్యపానం ద్వారా రూ. 22 వేల కోట్లు సంపాదించారు. మద్యం ఆదాయం ద్వారా రూ. 8 వేల కోట్లు అప్పు తెచ్చారు. అభివృద్ధి బాట కాకుండా.. ఏపీని అప్పుల బాట పట్టించారు.

ఎర్ర చందనం అక్రమ రవాణ చేస్తున్నారు.. మడ అడవులను ధ్వంసం చేశారు.కాలుష్య కారక పరిశ్రమలను బంగాళా ఖాతంలో కలిపేస్తానని.. రిబ్బన్లు కట్ చేస్తూ ఓపెనింగులు చేస్తున్నారు.పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు.. నిర్వాసితులను గాలికొదిలేశారు.తమ నిధులు తమకివ్వమని అడిగినా సర్పంచులను అరెస్టు చేస్తున్నారు.2.50 లక్షల ఉద్యోగాల భర్తీ లేదు.. డీఎస్సీ ఊసే లేదు.ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కోర్టులు చుట్టూ తిప్పుతున్నారు.ప్రజాస్వామ్యాన్ని కుల స్వామ్యం చేశారు.సాగు మోటార్లకు మీటర్లు పెడుతున్నారు.కౌలు రైతులకు మొండి చేయి చూపారు.వ్యవసాయాన్ని గాలికొదిలేశారు అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

పవన్ ట్వీట్లపై ఇప్పటికే మంత్రి రోజా సెటైర్లు వేశారు. ఇటు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ కూడా తాము కూడా తగ్గేది లే అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here