ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లా మంథని డేంజర్ జోన్‌లో చిక్కుకుంది. ఒకవైపు గోదావరి, మరోవైపు బొక్కల వాగు పొంగిపిర్లుతుండటంతో.. పలు వీధులు నీట మునిగాయి. పట్టనంలోని అంబేద్కర్ నగర్, మర్రివాడ, పాత పెట్రోల్ బంక్ ఏరియ, లైన్ గడ్డ, గ్రామ పంచాయితీ ఏరియా, గొల్లగూడెం, భగత్ నగర్, హుస్సేనీపురా, రజకవాడ, నాయి బ్రాహ్మణ వీది, దొంతుల వాడ, వాగు గడ్డ కాలనీలన్నీ నీట మునిగాయి. గోదావరి నదిలో ప్రవాహం తీవ్రంగా ఉండడంతో బొక్కలవాగు వంతెన మీదుగా నీరు ప్రవహిస్తోంది… సూరయ్యపల్లి గ్రామం జలదిగ్భందంలో చిక్కుకుంది. అయితే అక్కడ గ్రామంలోని చర్చి ఫాదర్ చిక్కుకుపోయినట్టు స్థానిక సమాచారం. ఇక మంథని, కాటారం రహదారిలోనూ కారపోకలు నిలిచిపోయాయి. దీంతో రెండురోజులుగా మంథని పట్టణానికి ఇతర గ్రామాలకు సంబంధాలు లేకుండా పోయాయి. వర్షం, వరద ఉధృతి తగ్గితే తప్ప పరిస్థితి సర్దుమణిగేలా లేదని అధికారులు చెబుతున్నారు.
గోదావరిఖని ఇంటెక్ వెల్ లో ఆరుగురు కార్మికులు
గోదావరిఖని ఇంటెక్ వెల్ లో ఆరుగురు కార్మికులు చిక్కుకుపోయారు. గోదావరినదిలో వదర ఉధృతి తీవ్రంగా వుండటంతో వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ ఎఫ్ బృందాలతో పాటు గజ ఈతగాల్లు కూడా రంగంలోకి దిగారు. కాగా.. బుధవారం రాత్రి కొమురం భీం జాలాల్లో వరద ఉధృతిలో ఇద్దరు రెస్క్యూ టీం సభ్యులు కొట్టుకుపోయి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.