చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు వైసీపీ నేతలు. తాజాగా వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రేంజ్ లో చంద్రబాబుని ఆడేసుకున్నారు. కందుకూరులో జరిగిన మారణకాండకు చంద్రబాబు బాధ్యత వహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమాయకుల ప్రాణాలు బలికావడానికి చంద్రబాబే కారణమన్నారు. కందుకూరులో నిబంధనలు పాటించి ఉంటే అమాయకులు బలయ్యేవారు కాదన్నారు. చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని, ఆయనకు కనీస సంస్కారం లేదన్నారు. వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. పోలీసు యాక్ట్‌కు లోబడే ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. ఈ నిర్ణయం అన్ని పార్టీలకు వర్తిస్తుంది. జీవోను ఉల్లంఘిస్తామని టీడీపీ ఛాలెంజ్ చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించడం సబబు కాదని సూచించారు. కుప్పానికి చంద్రబాబు దండయాత్రలా బయల్దేరారు. సభలు పెట్టుకోవద్దని చంద్రబాబుకు ఎవరూ చెప్పలేదన్నారు.
చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ప్రజలు చంద్రబాబు తీరును గమనించాలి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చంద్రబాబు ఆలోచించాలి. ప్రజల ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత. ప్రజల ప్రాణాలకు కష్టం కలిగించేలా రోడ్లపై సభలు రద్దు చేస్తూ ఓ జీవోను విడుదల చేశాం. ప్రత్యామ్నయ స్థలాలు చూసుకోవాలి. అపార్థాలకు అవకాశం లేకుండా సుదీర్ఘంగా చర్చించి పోలీసు యాక్ట్‌కు లోబడి జీవోను తీసుకువచ్చాం. దీని తరువాత అసలు ఈ ప్రభుత్వం జీవో తీసుకురావడం ఏంటి, దానికి మేం కట్టుబడటం ఏంటి?అమాయకుల ప్రాణాలు బలి కావడానికి నైతికంగా తాను బాధ్యత వహిస్తున్నానని చెప్పాల్సిన పెద్ద మనిషి. కనీసం సంస్కారం ఉంటుందని ఎవరైనా భావిస్తారు. కానీ చంద్రబాబు తనకు కనీస సంస్కారం లేదని, తానొక ఉన్మాదినంటూ, రక్షస సంస్కృతి అంటూ, వ్యవస్థలను కిళ్ల కింద వేసి నలుపుతానంటూ తన పాలనలో అదే చేశారన్నారు. చంద్రబాబు మారాలన్నారు.