టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సానియా మీర్జా..

0
1069

భారత స్టార్‌ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించింది. ఒకప్పటి డబుల్స్‌ నెంబర్‌ వన్ ప్లేయర్ సానియా మీర్జా ఈ ఏడాది ఫిబ్రవరి 19న దుబాయ్‌లో ప్రారంభమయ్యే (డబ్లూటీఏ1000) దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ ఈవెంట్ తర్వాత తన ఫ్రొఫెషనల్‌ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లుగా వెల్లడించారు సానియా మీర్జా. ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీర్జా తన రిటైర్మెంట్ గురించి మాట్లాడారు. 36 ఏళ్ల సానియా మీర్జా జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కజకిస్తాన్‌కు చెందిన అన్నా డానిలినాతో కలిసి మహిళల డబుల్స్‌లో ఆడనుంది. మోచేయి గాయం కారణంగా గతేడాది యూఎస్ ఓపెన్‌కు దూరమైన తర్వాత గ్రాండ్‌స్లామ్ ఈవెంట్‌లో ఆమె చివరి ప్రదర్శన ఇదే.

గాయంతో బాధపడుతున్న మీర్జా 2022 సీజన్ చివరిలో రిటైర్ కావాలని అనుకున్నారు. అయితే ఆగస్టులో మోచేయి గాయం ఆమెను యూఎస్ ఓపెన్‌కు దూరం చేసింది. సానియా మీర్జాకు ఉన్న స్వల్ప ఇబ్బందుల కారణంగా టెన్నిస్‌కు వీడ్కోలు పలకడం లేదని…కేవలం తన ఆట విషయంలో తనకున్న లక్ష్యాలను అధిగమించడం కారణంగానే వైదొలగుతున్నట్లుగా వరల్డ్ టెన్నిస్‌.కామ్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వూలో వెల్లడించింది. భారత్ టెన్నిస్‌లో అమ్మాయిలకు సానియా మీర్జా రోల్‌మోడల్‌గా నిలిచింది. 6 గ్రాండ్‌స్లామ్స్‌లో భారత్‌కు పతకాలు అందించింది. ఆమె 2016లో మహిళల డబుల్స్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె భారత్ తరఫున టెన్నిస్ ఆడింది.

రిటైర్మెంట్ తర్వా సానియా మీర్జా తన భర్త, మాజీ పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో కలిసి దశాబ్దానికి పైగా నివసించిన దుబాయ్‌లోని తన అకాడమీ దృష్టి సారించనున్నట్లు సానియా తెలిపింది. సానియా మీర్జా గత పదేళ్లుగా సంవత్సరాలుగా దుబాయ్‌లో నివసిస్తున్నారు. దుబాయ్‌లో సానియా మీర్జాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. సానియా మీర్జా అభిమానుల మధ్య టెన్నిస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనుంది.

హైదరాబాద్ సానియా మీర్జా స్వస్థలం కాగా.. ఆమె 2005లో మొదటిసారిగా డబ్ల్యూటీఏ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది. 2009లో ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి మహేష్ భూపతితో జతకట్టి తొలి విజయం సాధించింది. ఆమె 2012 ఫ్రెంచ్ ఓపెన్‌లో భూపతితో కలిసి రెండో విజయాన్ని సాధించింది. ఆమె మూడో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ విజయం 2014 యూఎస్ ఓపెన్‌లో, బ్రెజిలియన్ ఆటగాడు బ్రూనో సోరెస్‌తో కలిసి గెలుచుకుంది. 2015లో సానియా మీర్జా స్విస్ లెజెండ్ మార్టినా హింగిస్‌తో కలిసి మూడు వరుస గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here