తెలంగాణ సచివాలయ ఉద్యోగి కేసులో పురోగతి.. ధర్మ హత్యచేసిన వ్యక్తి బాబుగా గుర్తింపు

0
319

Dharma Case Details: తెలంగాణ సచివాలయ ఉద్యోగి ధర్మా కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ధర్మా హత్య చేసిన బాబు అనే వ్యక్తిది మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలోని లాగ్ లుడ్ గ్రామంగా గుర్తించారు అధికారులు. బాబు కూలి పనులకు నిత్యం లాగ్ లూడ్ నుంచి నిజామాబాద్ కి ట్రైన్ లో వచ్చాడని, ధర్మా లాగా ఉండటంతో ధర్మా, అతని అల్లుడు శ్రీనివాస్ లు బాబుకు పని ఉందని చెప్పి పిలిచి హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. సీసీ కెమెరాలు, ఆధార్ కార్డ్ ఆధారంగా బాబు అడ్రస్ గుర్తించిన పోలీసులు. బాబు హత్య జరిగిన ప్రాంతాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు చూపించారు. దీంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. డెడ్‌ బాడీని బాబుగా గుర్తించారు.

వివరాలు..

ఈ నెల 9వ తేదీన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ సమీపంలో కారులో కాలిపోయిన మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన ప్రమాదమా లేక హత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో పెట్రోల్ బాటిల్ లభ్యమైంది. దీంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో దిమ్మతిరికే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సచివాలయ ఉద్యోగి ధర్మానాయక్ ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ లో రూ. 2 కోట్లు అప్పులు చేశాడు. ధర్మాకు రెండుకోట్ల అప్పులు ఎలా తీర్చాలని భయం పట్టుకుంది. ఓ.. ఐడియా మైండ్‌ లో మొదలైంది. చనిపోయినట్లు నటిస్తే రూ. బీమా సొమ్ము రూ.7 కోట్లు వస్తాయి కాదా.. దాంతో అప్పులు తీర్చవచ్చని ధర్మానాయక్ భావించాడు. ఈ నెల 5న హైదరాబాద్ నుంచి కుటుంబసభ్యులతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లాలోని స్వగ్రామానికి బయలుదేరాడు.

కుటుంబ సభ్యులను ఇంటి వద్ద వదిలిపెట్టాడు. మొదట దర్మలాగా ఉన్న వ్యక్తి కోసం వెతికారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో బాబు అనే వ్యక్తిని తీసుకొచ్చారు. అతనికి బాసరలో గుండు గీయించి, ధర్మ బట్టలు వేశారు. అదే కారులో వెంకటాపూర్‌కి తీసుకొచ్చారు. చెరువు దగ్గరికి రాగానే, అతడ్ని కారు ముందుకు రమ్మన్నారు. అతడు సహకరించకపోవడంతో.. గొడ్డళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో బాబు చనిపోవడంతో.. అతని మృతదేహాన్ని కారు ముందు పెట్టి, కాలువలోకి తోసేసి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఏంచేసిన ఎంత పన్నాగం పనిన్నా చివరకు జైలు పాలు అయ్యారు. నిందితులపై 302, 364, 120B, 201, 202, 212 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here