కాంగ్రెస్ లోకి తీగల.. మూహూర్తం ఫిక్స్..?

0
103

మంత్రి సబితా ఇలాకాలోనే టీఆర్ఎస్ లో చెలరేగిన రాజకీయ దుమారం కాంగ్రెస్ నేతల రంగల ప్రవేశంలో ఎలాంటి మలుుపు తీసుకుంటుందో అనేది ఆసక్తిగా మారింది. ఈనేపథ్యంలో త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న వారి జాబితా ఇదే నంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో తీగల కృష్ణారెడ్డి పేరు కూడా ఉండటం గమనార్హం. తాను పార్టీ మారే ఉద్దేశంలో లేను అని ప్రకటించినప్పటికీ ఈనెల 11న కాంగ్రెస్ కండువా కప్పుకోవాడానికి తీగల ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారనే ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

అయితే ఇన్నాళ్లు రాజకీయంగా మౌనంగా ఉన్న తీగల కృష్ణారెడ్డి ఒక్క సారిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి విరుచుప‌డిన విష‌యం తెలిసిందే.. ప్రత్యర్థుల విమర్శలు .. సొంత పార్టీలో ఆమెకు వ్యతిరేక పవనాలు వీయడం సంచలనం రేపుతోంది. అయితే నియోజకవర్గంలోనే సబితా ఇంద్రారెడ్డి అక్రమాలకు ఆస్కారం ఇస్తోందని తీగల సంచల వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. అయితే దీనిపై సబితా ఇంద్రారెడ్డి ఓమీడియా సమావేశంలో తీగల వ్యాఖ్యలపై స్పందించి .. కృష్ణన్నతో నేను మాట్లాడుతా అంటూ చెప్పుకొచ్చారు. తీగ‌ల మాటల వెనుక ఉన్నదెవరూ అన్న చర్చ ఓవైపు జరుగుతుండగానే కాంగ్రెస్ రంగప్రవేశం చేయడం ఇప్పుడు సర్వతా చర్చనీయాంశం అవుతోంది. తీగల పార్టీ మారే ఉద్దేశంలో లేను అని ప్రకటించిన.. కాంగ్రెస్ కండువా కప్పుకోవాడానికి ఈనెల 11న తీగల ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారనే ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై తీగల ఇష్టపూర్వకంగానే కాంగ్రెస్ లో అడుగుపెడుతున్నారా? అనే చర్చలు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here