యావత్త ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. తాజాగా తెలంగాణలో 38,122 కరోనా టెస్టులు నిర్వహించగా 836 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా.. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 443 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 52, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 55 కేసులు నిర్థారణయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 35 కేసులు నమోదు కాగా.. పెద్దపల్లి జిల్లాలో 29 కేసులను గుర్తించారు.
నల్గొండలో 24, భువనగిరి 23, నిజమాబాద్, ఖమ్మం జిల్లాల్లో 16 చొప్పున కేసులు వెలుగు చూసాయి. ఒక్క రోజులో 765 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4986గా ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,63,92,848 కరోనా టెస్టులు నిర్వహించగా.. 8,17,367 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకూ 8,08,270 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.89 శాతంగా ఉండగా.. 4111 మంది కోవిడ్‌తో మృతి చెందారు.