తెలంగాణ రాష్ట్ర రైతన్నలు ఎదురు చూస్తున్న రైతుబంధు పంపిణీ రేపటి (జూన్ 28) నుంచే ప్రారంభానికి సర్వం సిద్దమైంది. రేపు మంగళవారం నుంచి రైతులకు పెట్టుబడి సాయం కింది రైతు బంధు నిధులు అందనున్నాయి. అయితే సీఎం కేసీఆర్ ఇప్పటికే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా.. వెంటనే సీఎస్ సోమేష్ కుమార్ రైతు బంధు పంపిణీకి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే సాయం పొందుతున్న రైతులతోపాటుగా.. కొత్త లబ్ధిదారులకు కూడా ఈసారి రైతు బంధు అందనుంది. దీంతో రైతుల్లో కొత్త ఉత్సామం నెలకొంది. జూన్ 5 లోపు రిజిస్ట్రేషన్ పూర్తైన, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన కొత్త వారికి కూడా సాయం అందనుంది.
కాగా.. కొత్తగా భూ యాజమాన్య హక్కులు పొందిన రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్ వివరాలతో పాటు ఆధార్ కార్డు.. బ్యాంకు ఖాతా వివరాలు ఏఈవోకు సమర్పించాల్సి వుంటుంది. అయితే గత ఏడాది వానా కాలం సీజన్ కోసం కొత్త లబ్ధిదారుల నమోదుకు జూన్ 10 చివరి తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జూన్ 5ని చివరి తేదీగా నిర్ణయిచింది ప్రభుత్వం. అయితే.. గత సీజన్‌లో దాదాపు 63 లక్షల మందికి రైతు బంధు సాయం అందించింన విషయం తెలిసిందే. ఈ ఏడాది అంతకుమించి రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని సమాచారం. ఈ సారి రైతు బంధు సాయం కోసం దాదాపు రూ.8 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. కాగా.. విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమవుతాయని వెల్లడించారు.