తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

0
89

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. జూన్ నెలకు సంబంధించిన ఈ టిక్కెట్లను ఈ ఉదయం 10 గంటలకు టీటీడీ రిలీజ్ చేయనుంది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు. జూన్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ్టి నుంచి విడుదల చేయనుంది టీటీడీ పాలకమండలి. గురువారం, శుక్రవారం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లతో పాటుగా అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు ఉంటాయి.

అదేవిధంగా, మిగతా ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్రక్రియను మార్చి 24న మొదలవుతుంది. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన వారు నిర్ణీత రుసుం చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వీటిని టీటీడీ వెబ్ సైట్ తో పాటు యాప్ ద్వారా భక్తులు టికెట్లను పొందే అవకాశం ఉంది. వయోవృద్ధులు, దివ్యాంగులు శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను మార్చి 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.

మరోవైపు, తిరుమలలో అక్రమాల నివారణకు టీటీడీ సరికొత్త విధానం అమల్లోకి తెచ్చింది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు అంశాల్లో పారదర్శకతను పెంచేందుకు ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీని తీసుకొచ్చింది. మార్చి ఒకటి నుంచి ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సర్వదర్శనం కాంప్లెక్స్‌లో ఒకే వ్యక్తి అధిక లడ్డూ టోకెన్లు పొందకుండా గదుల కేటాయింపు కేంద్రాల దగ్గర కాషన్ డిపాజిట్ కౌంటర్ల దగ్గర ఈ టెక్నాలజీని వాడకంలోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అయితే తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని వారికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here